‘ఓజీ’: అవి బెదిరింపుల్లా ఉన్నాయంటూ పవన్ కామెంట్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 1980-90ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు.
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (OG). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2019లో విడుదలైన ‘సాహో’ తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. ముంబయి - జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, వెంకట్, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరి నుంచే సినీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని పవన్ కళ్యాణ్ రివీల్ చేసారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ...ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు . ఈ క్రమంలో ఆయన హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ మూవీ ‘ఓజీ’. రీసెంట్ గా పవన్ ఎక్కడకు వెళ్లినా, ‘ఓజీ.. ఓజీ..’ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు.
అభిమానులు అలా అనగానే ముసి ముసి నవ్వులు నవ్వే పవన్ కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ చిరాకుపడ్డారు. తాజాగా మంగళగిరిలో మీడియా మీట్ లో జరిగిన చిట్‌చాట్‌లో తన సినిమాలపై మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ‘హరిహర వీరమల్లు’ (hari hara veera mallu) మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తాను’’ అని అన్నారు.
Pawan kalyan OG Glimpse
ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను ఉద్దేశించి తాజాగా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండి’ అని పేర్కొంటూ చిరు విన్నపం చేసింది. ‘‘ఓజీ’పై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.
కానీ, పవన్‌కల్యాణ్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అరవడం, ఆయన్ని ఇబ్బందిపెట్టడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. కాబట్టి కొన్ని రోజులు ఓపికగా ఎదురుచూద్దాం. 2025.. ఓజీ పండుగ ఘనంగా జరగనుందని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అని పేర్కొంది. అంతేకాకుండా ఈ చిత్రంతో థియేటర్లలో అల్లాడిద్దామని అభిమానులకు తెలిపింది.
Pawan kalyan OG Glimpse
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...‘‘సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి.
ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం’’ అని అన్నారు.