- Home
- Entertainment
- ఓజీ మూవీ ఫస్ట్ హాఫ్ రివ్యూ, ఆ సీన్లకి థియేటర్లు దద్దరిల్లుతాయి.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే
ఓజీ మూవీ ఫస్ట్ హాఫ్ రివ్యూ, ఆ సీన్లకి థియేటర్లు దద్దరిల్లుతాయి.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ ని పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ రూమ్ లో చూశారట. ఫస్ట్ హాఫ్ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊహకందని అంచనాలతో ఓజీ మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఓజీ మూవీపై అలాంటి ఇలాంటి క్రేజ్ లేదు.. ఇప్పటి వరకు ఈ చిత్రం వచ్చిన ప్రతి సాంగ్స్, టీజర్స్ సినిమాపై హైప్ పెంచుతూ పోయాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ అనిపించే అంచనాలతో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇప్పటికే 1.75 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే
ట్రైలర్ రాకముందే ఈ స్థాయిలో అంచనాలు ఉంటే.. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆదివారం సెప్టెంబర్ 21న ఉదయం 10.08 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్ ఓజీ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓజీ ఫస్టాఫ్ పై పవన్ కళ్యాణ్ రివ్యూ
రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ రూమ్ లో చూశారు. కీలక మైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఆ సన్నివేశాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా నచ్చేశాయి. థియేటర్స్ లో ఆడియన్స్ కూడా అదే వైబ్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు కురిపించినట్లు తమన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ పాడిన పాట
తమన్ ఈ చిత్రంలో వాషి వాషి అనే జపనీస్ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ పాటని పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ పాటని పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నప్పుడు ఓజీ హుడీ ధరించమని రిక్వస్ట్ చేశాం. ఆయన వెంటనే ఓజీ హుడీ ధరించి ఈ పాట పాడారు.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల హైక్
ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు ఓజీ స్పెషల్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలో పైడ్ ప్రీమియర్ షోల టికెట్ ధరని రూ 800గా నిర్ణయించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు.