- Home
- Entertainment
- అల్లు అర్జున్ చేసిన నష్టానికి పవన్ కళ్యాణ్ నివారణ చర్యలు.. తేరుకున్న బన్నీ.. కన్ ఫ్యూజన్‌కి తెరపడినట్టేనా?
అల్లు అర్జున్ చేసిన నష్టానికి పవన్ కళ్యాణ్ నివారణ చర్యలు.. తేరుకున్న బన్నీ.. కన్ ఫ్యూజన్‌కి తెరపడినట్టేనా?
మెగా అభిమానుల్లో ఓ పెద్ద కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అదే సమయంలో పెద్ద నష్టం వాటిళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు పవర్ స్టార్.

గత రెండు మూడు రోజులుగా మెగా అభిమానుల్లో ఓ పెద్ద కన్‌ఫ్యూజ్ నెలకొంది. ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని పవన్ కళ్యాణ్ వర్గంలోనూ, ఇటు మెగా ఫ్యాన్స్ లోనూ డైలమా నెలకొంది. బన్నీ చర్యలు వాళ్లకి కోపం తెప్పించాయి. దీంతో ఆయన్ని దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు. ఇలా దెబ్బ కొట్టాడేంటి అని మండిపడ్డారు. కానీ నష్టం గట్టిగానే జరిగే ప్రమాదం ఉంది. వెంటనే తేరుకున్నారు పవన్. నివారణ చర్యలు చేపట్టాడు. దీనికి బన్నీ కూడా రియాక్ట్ కావడం వారికి ఊరటగా నిలుస్తుంది.
మరి ఇంతకి బన్ని క్రియేట్ చేసిన నష్టమేంటి? దాన్ని పవన్ ఎలా నివారణ చర్యలు చేపట్టాడనేది చూస్తే, పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యే కి పోటీ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీతో కలిసి అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. కూటమీగా పోటీ చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్‌కి సినిమా వర్గాలు అంతా సపోర్ట్ చేస్తున్నాయి. మెగా హీరోలు ఆయన వెన్నంటే ఉన్నారు. వరుణ్ తేజ్, నాగబాబు, సాయిధరమ్ తేజ్, రామ్‌చరణ్ ఆయనకోసం ప్రచారంలోనూ పాల్గొన్నారు. వీరితోపాటు అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా సపోర్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
కట్ చేస్తే మరుసటి రోజే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. నంధ్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంధ్యాలకు వెళ్లి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేశారు. ఫ్రెండ్‌ని గెలిపించాలని తెలిపారు. దీనిపై భిన్న వాదాలు రావడంతోపాటు వివాదంగా మారిన నేపథ్యంలో నా మనసుకి నచ్చిన వారికి సపోర్ట్ చేస్తానని తెలిపారు బన్నీ. దీంతో బన్నీని వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు. ఆయన మద్దతు పార్టీకి ఉందని ఫోటోలు వేసుకుంటున్నారు. దీంతో బన్నీ క్రేజ్ మొత్తం వైసీపీకి ప్లస్ అయ్యేలా ఉంది. ఇది ఓ రకంగా పెద్ద నష్టమనే అని జనసేన నాయకులు, టీడీపీ నాయకులు భావించారు. మరోవైపు బన్నీపై అభిమానులు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.
ఇక కరెక్ట్ గా ఎలక్షన్ రోజు సీన్ డైవర్ట్ చేశాడు పవన్. నష్టనివారణ చర్యలు చేపట్టాడు. పవన్‌కి మద్దతుగా చేసిన ట్వీట్‌కి స్పందించారు పవన్. తనకు మద్దతు ప్రకటించిన సెలబ్రిటీలందరికీ రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగా బన్నీకి స్పందించారు పవన్. తన సపోర్ట్ తమకి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్‌కి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నేను హామీ ఇస్తున్నా` అని వెల్లడించారు పవన్.
బన్నీ వల్ల జరిగే నష్టాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు పవన్. అయితే దీనికి బన్నీ మళ్లీ రియాక్ట్ అయ్యారు. మోస్ట్ వెల్‌కమ్ అని చెబుతూ, రేపటి(ఓటింగ్) కోసం అభినందనలు తెలియజేశారు. దీంతో నష్టం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో బన్నీ రియాక్షన్ కూడా నష్టాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇది మెగా అభిమానుల్లో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌కి తెరపడినట్టేనా? అది ఏ మేరకు తమకు ప్లస్ అవుతుంది? ఎంత నష్టం చేస్తుందనేది ఎలక్షన్ల ఫలితాలను బట్టి తెలుస్తుంది.