- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్-రాజమౌళిని కలిపే బాధ్యత తీసుకున్న విజయేంద్ర ప్రసాద్, ముహూర్తం ఎప్పుడంటే..?
పవన్ కళ్యాణ్-రాజమౌళిని కలిపే బాధ్యత తీసుకున్న విజయేంద్ర ప్రసాద్, ముహూర్తం ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే ఉంది. ఇక వీరిద్దరిని కలిపే బాధ్యత తీసుకున్నారట జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.

రాజమౌళి సినిమా అంటే... అది వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఉంటుంది. అటువంటి జక్కన్న పవర్ స్టార్ తో సినిమా చేస్తే.. బ్లాక్ బస్టర్ బాంబ్ పేలే అవకాశం పక్కాగా ఉంటుంది. మరి ఈ ఇద్దరి కాంబో కలిసేది ఎప్పుడు... అని ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్. కాని ఈ కాంబో కలిసేది ఎప్పుడు.. ? ఈ ఇద్దరిని కలిపే బాధ్యత తీసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ కంటే ప్రత్యేకమైన అభిమానం. బాహుబలి ఇంటర్వెల్ సీన్ కి పవన్ కళ్యాణే స్ఫూర్తి అని చాలా సందర్భాల్లో చెప్పారాయన. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడాయన ఓ కథ కూడా రెడీ చేశారట. ఈ కథతో రాజమౌళి డైరెక్షన్ లో.. సినిమా చేస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం పవర్ స్టార్ కు సరిపడే కథల కోసం.. చాలా మంది దర్శక, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఈ కథను అడిగితే సినిమా చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం తన కథని రాజమౌళిడైరెక్షన్ లోనే చేయాలని .. అప్పుడే తన కథకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.
రాజమౌళికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ జక్కన్న ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. కాని అది కుదరడంలేదు. జక్కన్నతో సినిమా అంటే దాదాపు రెండు మూడేళ్లు సమర్పించుకోవాలి. ప్రస్తుతం పాలిటిక్స్, సినిమాలు రెండింటిని బ్యాలెస్స్ చేస్తున్న పవన్.. అంత టైమ్ ఇచ్చే చాన్స్ ఉండకపోవచ్చు.
ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథతో సిద్ధంగా వున్నారు. ఐతే రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమాతో సినిమా చేయాలి. అది పూర్తయినప్పటికీ కనీసం రెండేళ్ళయినా పడుతుంది. ఈలోగ విజేయంద్ర ప్రసాద్ తయారుచేసుకున్న కథ వేరే దర్శకుడికి ఇస్తే మాత్రం త్వరగానే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది.
ఐతే ఈ కథ వేరే వాళ్లకి ఇచ్చే అవకాశం తక్కువ. రాజమౌళినే చేయాలనే పట్టుదలతో వున్నారు విజయేంద్ర ప్రసాద్. అటు పవర్ స్టార్ కూడా మూడు సినిమాల వరకూ కమిట్ అయ్యి ఉన్నారు. ఇన్న క్లాష్ ల మధ్య సినిమా సెట్ అయ్యే అవకాశం కనిపించడంలేదు.