- Home
- Entertainment
- Pawan Kalyan: త్రివిక్రమ్ ని తిట్టి ఏం లాభం పవన్ కి తెలియదా! అవకాశం ఉంది నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు
Pawan Kalyan: త్రివిక్రమ్ ని తిట్టి ఏం లాభం పవన్ కి తెలియదా! అవకాశం ఉంది నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు
సినిమాను కళగా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు చేసే సినిమాలన్నీ లాభాల లెక్కలతో చేసేవే. ఓ పెద్ద హీరో నిర్మాతకు డేట్స్ ఇస్తే చాలు కొన్ని కోట్లు పాకెట్లో వచ్చిపడినట్లే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా లాభాలు రాబట్టవచ్చు.

థియరిటికల్ రైట్స్ తో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మరికొంత ఆదాయం. అందుకే స్టార్ హీరోలు అడిగిన కాడికి ఇచ్చి సినిమాలకు సైన్ చేయించుకునే బడా ప్రొడ్యూసర్స్ పరిశ్రమలో పదుల సంఖ్యలో ఉన్నారు. పైన చెప్పిన సూత్రాల ప్రకారం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి హీరోకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
pawan kalyan
పవన్ రెండేళ్ల తర్వాత సినిమా చేస్తా అన్నా... ఈ రోజే అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. కమ్ బ్యాక్ తర్వాత పవన్ చేస్తుంది కూడా అదే. తనకున్న డిమాండ్ ని తెలివిగా పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. ముందుగా ఒప్పుకున్న సినిమాలు కూడా పక్కన పెట్టి తక్కువ టైం లో పూర్తయ్యే ప్రాజెక్ట్స్ ఓకె చేస్తున్నారు.
వకీల్ సాబ్ మూవీ తర్వాత పవన్ క్రిష్, హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆయన భీమ్లా నాయక్ (Bheemla Nayak)ప్రాజెక్ట్ తలకెత్తుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన యుద్ధ ప్రాదిపదిక పూర్తి చేయడానికి కారణం తక్కువ డేట్స్ లో షూట్ కంప్లీట్ కావడం. రెమ్యూనరేషన్ మాత్రం అన్ని చిత్రాల మాదిరే ఉంటుంది. పవన్ ఈ నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే సలహాలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో తమిళ చిత్రం వినోదయా చిత్తం రీమేక్ చేసేలా పవన్ ని త్రివిక్రమ్(Trivikram) పురిగొలిపారన్న టాక్ ఉంది. పవన్ తో పాటు ఆయన కూడా భారీగా ఆర్జిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన త్రివిక్రమ్ రూ. 20 కోట్ల పైనే రాబట్టారు. పవన్ కళ్యాణ్ కి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండే వినోదయ చిత్తం సెట్స్ పైకి వెళితే త్రివిక్రమ్ మరో బంపర్ ఛాన్స్ దక్కినట్లే.
త్రివిక్రమ్ పవన్ ని రీమేక్ చిత్రాల వైపు మళ్లించడం ఫ్యాన్స్ తో పాటు ఆయన సైన్ చేసిన దర్శక నిర్మాతలకు నచ్చడం లేదు. నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ హరి హర వీరమల్లు (Hari hara veeramallu) చాలా ఆలస్యమైంది. ఇక హరీష్ శంకర్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఈ చిత్ర నిర్మాతలు మైత్రి మేకర్స్ త్రివిక్రమ్ పట్ల అసహనంగా ఉన్నారు. ఈ విషయంలో మైత్రి మేకర్స్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.
Bhavadeeyudu Bhagat Singh
ఎట్టకేలకు నిన్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagathsingh) సెట్స్ పైకి వెళ్లనుంది. అప్డేట్ త్వరలో అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక సురేంధర్ రెడ్డితో చేయాల్సి మూవీ హోల్డ్ లో పడినట్లే అని వార్తలు వస్తున్నాయి. అయినా పవన్ చిన్నపిల్లోడి కాదు కదా... ముందుగా ఒప్పుకున్న సినిమాలు ఫస్ట్ పూర్తి చేయాలని ఆయనకుండాలి. త్రివిక్రమ్ ని తిట్టడం వలన ప్రయోజనం ఏముంది. అవకాశం ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుంటే తప్పేంటి చెప్పండి...