- Home
- Entertainment
- రేణు దేశాయ్, అకీరా, ఆద్యాలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్ బయటపెట్టిన పవర్ స్టార్
రేణు దేశాయ్, అకీరా, ఆద్యాలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్ బయటపెట్టిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్ కళ్యాణ్. అనేక రూమర్లకి చెక్ పెట్టాడు.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్ కళ్యాణ్. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన ఆస్తులేంటో బయటపెట్టాడు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన భార్య, పిల్లలకు తాను ఏం ఇచ్చాడు చెప్పాలేదు. అయితే ప్రచారంలో మాత్రం చాలా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల ఓ పొలిటికల్ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చిన ఆస్తుల గురించి చెప్పారు. ఆస్తులన్నీ జనాలకు, పార్టీకే పెడితే పిల్లలు, భార్య రేపు అడగరా అని యాంకర్ ప్రశ్నించగా, పవర్ స్టార్ రియాక్ట్ అయ్యాడు.
Pawan Kalyan
`పాపం వాళ్లకి అవేం తెలియదు. అడిగేంత లేదు. నిజంగా అలా చేయరు కూడా. నేను వారిని అలా పెంచలేదు. పిల్లలను అర్భన్ వాతావరణంలో పెంచాను. సగటు ఉద్యోగి పిల్లలు ఎలా పెరుగుతారో అలానే పెంచాను. ఇంకా చెప్పాలంటే వాళ్లని అయా విషయాల్లో భయపెడతాను` అని వెల్లడించి షాకిచ్చాడు పవన్. ఇంకా చెబుతూ, వాళ్లకి మాగ్జిమమ్ ఏం ఇవ్వగలం మంచి ఎడ్యూకేషన్ ఇవ్వగలను. కుదిరితే సినిమాల ద్వారా ఏదైనా సంపాదిస్తే ఆ ఆస్తులేవో ఇస్తాను అని తెలిపారు పవన్.
అయితే తమ మధ్య ఇలాంటి చర్చ అసలు జరగదు అని చెప్పారు పవన్. నా భార్య(రేణు దేశాయ్), పిల్లలు(అకీరా నందన్, ఆద్య)లకు ఇళ్లు రాసిచ్చాను. అలాగే పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. అవి ఇచ్చేశాను. అవి ఎడ్యూకేషన్‌కి ఉపయోగపడతాయి. ఏ తండ్రైనా ఇంతకంటే మాగ్జిమమ్ ఏంచేయగలడు అన్నారు పవన్. అయితే ఎంత ఆస్తి ఇచ్చామనేది కాదు, ఎంత నిలబెట్టుకున్నారనేది ముఖ్యమని చెప్పాడు.
ఈ సందర్భంగా తాను పెరిగిన విషయాలు చెబుతూ, `మా నాన్న నాకేం ఇవ్వలేదు. మా అన్నయ్య కూర్చోబెట్టి స్కిల్స్ నేర్పించాడు. నాన్న ధైర్యాన్నిచ్చాడు. నేను వాటికి మించే చేశాను. అలా నా పిల్లలకు నేను కూడా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలిగే ఎడ్యూకేషన్ ఇచ్చాను` అని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్.. మొదట నందిని పెళ్లి చేసుకోగా, 2007లో విడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకి రేణు దేశాయ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్యలు జన్మించారు. 2012లో రేణుతోనూ విడిపోయాడు పవన్. అనంతరం రష్యా హీరోయిన్ అన్నా లెజెనెవాని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీళ్లు కలిసే ఉన్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తన జనసేనా పార్టీ తరఫున బరిలో నిలిచారు. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి గెలుస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. జూన్ 4న ఈ ఎన్నికల రిజల్ట్ రాబోతుంది.
ఇదిలా ఉంటే హీరోగా పవన్ ప్రస్తుతం `ఓజీ` మూవీలో నటిస్తున్నాడు. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. దీంతోపాటు `ఉస్తాద్ భగత్ సింగ్`, `హరిహర వీరమల్లు` చిత్రాలు చేస్తున్నాడు పవన్. మరి ఎన్నికల్లో గెలిస్తే ఈమూవీ షూటింగ్‌లు కంప్లీట్ చేస్తాడా? లేదా వదిలేస్తాడా అనేది పెద్ద సస్పెన్స్ గా మారిన విషయం తెలిసిందే.