- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ కి పిచ్చ పిచ్చగా నచ్చిన చిరంజీవి మూవీ అదొక్కటే, రీమేక్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు
పవన్ కళ్యాణ్ కి పిచ్చ పిచ్చగా నచ్చిన చిరంజీవి మూవీ అదొక్కటే, రీమేక్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు
చిరంజీవి కెరీర్ అద్భుతమైన చిత్రంగా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కానీ, రీమేక్ కానీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కథ కూడా రెడీ అయింది. కానీ ఆ మూవీ ప్రారంభ దశలోనే ఆగిపోయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Megastar Chiranjeevi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో రీమేక్ చిత్రాలు కూడా చేశారు. వాటిలో చాలా చిత్రాలు హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కి తన సోదురుడు చిరంజీవి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవన్ పూర్తి చేయాల్సిన చిత్రాలు అలాగే ఉన్నాయి.
megastar chiranjeevi
చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. చిరంజీవి చిత్రాలని రాంచరణ్ రీమేక్ కానీ సీక్వెల్ కానీ చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి చాలా రోజులగా వినిపిస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేస్తే అది రాంచరణ్ మాత్రమే చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి కోరిక కూడా అదే. పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవి నటించిన మరో బ్లాక్ బస్టర్ చిత్రంపై కన్నేశారట.
ఈ విషయాన్ని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం అట. ఆ చిత్రానికి రీమేక్ కానీ సీక్వెల్ కానీ చేయాలని పవన్ కళ్యాణ్ జానీ చిత్రం ఫ్లాప్ తర్వాత అనుకున్నారు. దర్శకుడు వీరశంకర్ ని పవన్ కళ్యాణ్ పిలిపించారు. నాకు వేరే కథలు వద్దు. అన్నయ్య ఖైదీ చిత్రం అంటే చాలా ఇష్టం. ఖైదీ లాంటి కథ కావాలి. ఆ చిత్రం ఇన్సిపిరేషన్ తో అదే పాయింట్ బేస్ చేసుకుని కథ చేయండి అని వీర శంకర్ ని పవన్ కోరారు.
Chiranjeevi
కానీ పవన్ ఒక కండిషన్ పెట్టారట. ఖైదీ ఆధారంగా స్టోరీ లైన్ మాత్రం మీరే రెడీ చేయాలి. మరో రచయిత సాయం తీసుకోకూడదు అని చెప్పారట. స్టోరీ లైన్ ఒకే అయ్యాక పూర్తి కథని మాత్రం ఇతర రచయితల సాయంతో చేసుకోవచ్చు అని చెప్పారట. దీనితో వీర శంకర్ టెన్షన్ పడుతూ తన వద్దకు వచ్చారని తోట ప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కంగ్రాట్స్ చెప్పాను. ఇద్దరం కూర్చుని ఖైదీ ఆధారంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ కథ లైన్ ని సెట్ చేశాం.
పవన్ కళ్యాణ్ గారు ఆ లైన్ ని ఓకే చేశారు. పూర్తి కథని డెవలప్ చేయడానికి నాగబాబు ఒక రచయితని రికమండ్ చేశారట. నీ తరుపున మరో రచయితని తెచ్చుకోమని పవన్ చెప్పారట. వీర శంకర్ ఆ టైం తోట ప్రసాద్ ని కాకుండా మరో రచయితని తీసుకున్నారు. దీనితో తాను హర్ట్ అయినట్లు తోట ప్రసాద్ తెలిపారు. నన్ను తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోలేదు అని అడిగా. ఆ టైంలో నేను మా టీవీలో జాబ్ చేస్తున్నా. నిన్ను ఎందుకు డిస్ట్రబ్ చేయడం అనిపించింది అని వీర శంకర్ చెప్పారట.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ముందుకు సాగలేదు. ఆ తర్వాత పవన్ తో వీర శంకర్ గుడుంబా శంకర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ నిరాశపరిచింది. ఆ విధంగా పవన్ చేయాలనుకున్న ఖైదీ సీక్వెల్ కలగానే మిగిలిపోయింది.