- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ అతిపెద్ద డ్రీమ్ ఇదే, రామోజీరావుని చూసి వదిలేశారు..ఆయన ముందే ఏమన్నారంటే..
పవన్ కళ్యాణ్ అతిపెద్ద డ్రీమ్ ఇదే, రామోజీరావుని చూసి వదిలేశారు..ఆయన ముందే ఏమన్నారంటే..
మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మీడియా దిగ్గజం రామోజీ రావు శనివారం రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిశ్రామిక వేత్తగా, మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఈనాడు గ్రూప్ ని ప్రారంభించి దానిని రామోజీ రావు సక్సెస్ ఫుల్ చేశారు. ఈనాడుతో పాటు ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. సినిమా రంగం, టివి రంగంలో రామోజీ రావు చెరగని ముద్ర వేసారు. తెలుగువారికి దూరదర్శన్ మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో రామోజీరావు ఈటివిని ప్రారంభించారు.
రామోజీరావు మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రామోజీ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రామోజీ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు. రామోజీ రావు మృతి తనని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈటివి 20 ఏళ్ళ సెలెబ్రేషన్స్ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ సమయంలో పవన్.. రామోజీ రావుతో వేదిక పంచుకున్నారు. రామోజీ రావు పక్కనే ఉండగా పవన్ కళ్యాణ్ ఒక సంచలన విషయాన్ని తెలిపారు. ఒక పెద్ద ఫిలిం సిటీ కట్టాలనేది తన కల అని పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ రామోజీ రావు లాంటి ఉన్నతమైన వ్యక్తి ఫిలిం సిటీ నిర్మిస్తున్నారు అని తెలియగానే తన ఆలోచన విరమించుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆసియా ఖండంలోనే రామోజీ ఫిలిం సిటీ పెద్దది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా సితార అవార్డు వచ్చింది అని.. ఆ ఈవెంట్ ని రామోజీ రావు అద్భుతంగా నిర్వహించారని నాకు తెలిసింది. మొట్ట మొదటిసారి రామోజీరావు పేరు వినడం అదే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రామోజీరావు ఈ స్థాయికి చేరుకున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రజలకు సరికొత్తగా వార్తలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా రామోజీ రావే అని పవన్ తెలిపారు.