MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్.. ఎలాంటి సినిమా రాబోతోంది.. ఫ్యాన్స్ ఇలానే కావాలంటున్నారే.!

సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్.. ఎలాంటి సినిమా రాబోతోంది.. ఫ్యాన్స్ ఇలానే కావాలంటున్నారే.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. యాక్షన్ ఫిల్మ్స్ కు కేరాఫ్ గా మారుతున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ కాంబోలో  వచ్చే సినిమాపై ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 05 2022, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతిలో ఇప్పటికే మూడు చిత్రాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’, ‘వినోదయ సీతం’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులకు పవన్ సర్ ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన తదుపరి చిత్రంపైనా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ కు యంగ్ అండ్ టాలెటెండ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించి తన మార్క్ చూపించిన విషయం తెలిసిందే. తీసినవి రెండు చిత్రాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో సుజీత్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించకున్నాడు. 
 

36

మూడేండ్లుగా తన సినిమాలపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయని సుజీత్ రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే  స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశారని, పవన్ కూడా ఒకే అన్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందించబోతున్నారంట దర్శకుడు సుజీత్.
 

46

ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందనడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘పంజా’ తరహాలో సినిమాను తెరకెక్కించాలని సుజీత్ ను కోరుతున్నారు. ఇప్పటికే వరుసపెట్టి రీమేక్ లు చేస్తున్న పవర్ స్టార్ ను కూడా ఈసారైనా రీమేక్ కాకుండా చూడాలని కోరుతున్నారు. పక్కా యాక్షన్ ఫిల్మ్ నే దింపుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంపై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకున్నా.. అభిమానులు, సినీ వర్గాలు మాత్రం వీరి కాంబో సెట్ అయ్యిందంటున్నారు. 
 

56

ఇకపోతే అటు పొలిటికల్ షెడ్యూల్ కు, ఇటు సినిమాలకు సమయం కేటాయించడం పవన్ కళ్యాణ్ కు కత్తిమీద సాములా మారిపోతోంది. అయినా అభిమానులను ఖుషీ చేసేందుకు తన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu) రెగ్యూలర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘పవర్ గ్లాన్స్’కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పవన్ లుక్, క్రిష్ దర్శకత్వం కొత్తగా కనిపించాయి.

66

మరోవైపు వపన్ ఒకే చేసిన చిత్రాల్లో ‘భవదీయుడు భగత్ సింగ్’, ‘వినోదయ సీతం’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ చిత్రాలు మొదలే కాలేదు. ఈ క్రమంలో సుజీత్ తో సినిమా లాక్ అంటూ, ఇది క్విక్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిబట్టి చూస్తూ ఆ రెండు చిత్రాలు మరింత ఆలస్యం అవుతాయని అర్థమవుతోంది. మున్ముందు పవన్ - సుజీత్ కాంబోపై మరింత సమచారం వచ్చే అవకాశం ఉంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved