MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..? బేబి బంప్ ఫోటోస్ వైరల్..

మరోసారి తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..? బేబి బంప్ ఫోటోస్ వైరల్..

మరోసారి తల్లి కాబోతోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్. ఈ కాలంలో పెళ్ళి లేటుగా చేసుకుని.. పిల్లల్ని ఇంకా లేటుగా కంటున్నారు హీరోయిన్లు. కాని ఈబ్యూటీ మాత్రం వెంట వెంటనే పిల్లల్ని కనేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2024, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈమధ్యలో చాలా మంది హీరోయిన్లు పెళ్ళిల్లు వరుసగా జరిగిపోయాయి. పెళ్లిళ్లు మాత్రమే కాదు వెంటనే పిల్లలు కూడా కనేస్తున్నారు. సాధారణంగా సినిమా హీరోయిన్లు పెళ్లయిన వెంటనే పిల్లలు కనేందుకు పెద్దగా ఇష్టపడరు. కాని ఈమధ్య యంగ్ హీరోయిన్లు తొందరగా పెళ్ళి చేసేసుకుంటున్నారు.. వెంటనే పిల్లలను కనడానికి ఆరటపడుతున్నారు. అంతే కాదు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్స్ అయినవారు కూడా ఉన్నారు. 

26
<p>praneetha</p>

<p>praneetha</p>

చాలా మంది హీరోయిన్లు ఒకవేళ బిడ్డను  కన్నా కూడా ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఓ హీరోయిన్ సూపర్ ఫాస్ట్ తా ఉంది. వెంట వెంటనే బిడ్డల్ని కనేస్తోంది.ఆమె ఎవరో కాదు హీరోయిన్ ప్రణీత సుభాష్.  అందరికంటే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తోంది ప్రణీత. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ  పెళ్ళి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది. 

36

బెంగళూరుకు చెందిన కన్నడ డాక్టర్స్ ఫ్యామిలీలో జన్మించిన ప్రణీత.. 2010లో కన్నడ మూవీ పోర్కితో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, తొలి సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకుంది. ఇక వెంటనే లేట్ చేయకుండా.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈచిన్నది..  ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. ఇక వరుసగా  బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో తెగ హడావిడి చేసింది. 

46

 స్టార్ హీరోయిన్ అయ్యేంత గ్లామర్ ఉన్నా..స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అంతే కాదు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సినిమా అవకాశాలు పొందింది. స్టార్ హీరోలసరసన హిట్లు పడుంటే ప్రణీత కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకునేదేమో. ఇక తెలుగు తో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న‌ ప్రణీత.. 2021 మే 30న బిజినెస్ మేన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది.

56

ఈ దంప‌తుల‌కు 2022 జూన్ లో పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. అయితే పాప పుట్టిన రెండేళ్ల‌కే.. మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది ప్రణీత. తాజాగా ఈ  గుడ్‌న్యూస్ ను  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది బ్యూటీ. తాను మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రౌండ్ 2..  స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ప్యాంట్స్ స‌రిపోవ‌డం లేదు అనే ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ తో ప్ర‌ణీత సోష‌ల్ మీడియా ద్వారా బేబీ బంప్ ఫోటోల‌ను షేర్ చేసింది. 

66

ఇక ఈ న్యూస్ చూసి ఆమె ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఫ‌స్ట్ ప్రెగ్నెన్సీ కొద్ది నెల‌ల‌కు ఆన్ స్క్రీన్ కు దూరంగా ఉన్న ప్ర‌ణీత‌.. ఈ ఏడాది ఆరంభంలో తంకమణి అనే మ‌ల‌యాళ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత రమణ అవతార అనే క‌న్న‌డ మూవీలో మెరిసింది. తెలుగులో ప్ర‌ణీత చివ‌రి చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఆమె ఒక చిన్న అతిథి పాత్ర‌లో కనిపించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Recommended image2
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి
Recommended image3
50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved