- Home
- Entertainment
- Meera Jasmine: చందమామను మింగేసిందా మబ్బులతో స్నానం చేసిందా... వైరల్ గా మీరా జాస్మిన్ మెస్మరైజింగ్ లుక్!
Meera Jasmine: చందమామను మింగేసిందా మబ్బులతో స్నానం చేసిందా... వైరల్ గా మీరా జాస్మిన్ మెస్మరైజింగ్ లుక్!
అందానికి చిరునామాలా ఉంటుంది మీరా జాస్మిన్. ఈ క్యూట్ బ్యూటీ ఒకప్పుడు పరిశ్రమను ఏలింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ తో షాక్ ఇస్తుంది. తాజాగా నిండైన బట్టల్లో ఆకట్టుకుంది.

Meera Jasmine
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన విమానం మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసింది. అలాగే మాధవన్, నయనతార, సిద్ధార్థ్ నటిస్తున్న స్పోర్ట్ డ్రామా టెస్ట్ లో ఓ కీలక రోల్ చేస్తుంది. ఇది తమిళ చిత్రం.
Meera Jasmine
క్వీన్ ఎలిజబెత్ టైటిల్ తో ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది మీరా జాస్మిన్ అభిమానులు అందించాల్సిన విషయం. మీరా జాస్మిన్ మిలీనియమ్ బిగినింగ్ లో సంచలనాలు చేసింది. హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీరాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది . ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యేవారు.
Meera Jasmine
కెరీర్ నెమ్మదించాక పెళ్లి చేసుకొని మీరా జాస్మిన్ పరిశ్రమకు దూరం అయ్యారు. భర్తతో, కుటుంబ సభ్యులతో ఆమెకు విబేధాలు తెలెత్తాయని సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారట. మీరా జాస్మిన్ అంటే రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై నిండైన బట్టల్లో సాంప్రదాయంగా కనిపించారు.
Meera Jasmine
ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణతో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ మూవీ చేశారు. ఇటీవల గుడుంబా శంకర్ రీ రిలీజ్ కాగా మీరా ఆనందం వ్యక్తం చేసింది. 2014 తర్వాత మీరా జాస్మిన్ కి ఆఫర్స్ తగ్గాయి. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు. 2018లో ఓ మలయాళ చిత్రం చేశారు. మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి.
Meera Jasmine
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్. గతంలో వెండితెరపై ఆమె చేసిన పాత్ర దృష్ట్యా మీరా జాస్మిన్ హాట్ గా కనిపించడం కొత్తగా తోస్తుంది.