- Home
- Entertainment
- హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంత ? వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వస్తే సేఫ్
హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంత ? వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వస్తే సేఫ్
హరిహర వీరమల్లు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. దీనితో ఈ చిత్ర కలెక్షన్స్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ ఎన్ని కోట్లు రాబడితే హిట్ అనిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం.

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు చిత్రం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగిసింది. దాదాపు 5 ఏళ్ళ పాటు పలు వాయిదాలతో ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. ఎట్టకేలకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి కాసేపట్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ? ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూళ్లు సాధిస్తే హిట్ అయినట్లు లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు
తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు చిత్రానికి 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం లో అత్యధికంగా ఈ చిత్ర హక్కులు 37 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 16.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లకు థియేటర్ రైట్స్ అమ్ముడయ్యాయి. మిగిలిన ఏరియాలు ఈస్ట్ గోదావరిలో 9.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లకు బిజినెస్ జరిగింది.
వీరమల్లు టార్గెట్ ఇదే
అదే విధంగా కర్ణాటక, ఇండియాలోని ఇతర ప్రాతాల బిజినెస్ 12 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు టోటల్ బిజినెస్ 126 కోట్లు. అంటే ఈ చిత్రం 127 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ జరిగి హిట్ అయినట్లు. మరి వీరమల్లు ఈ టార్గెట్ అని అందుకుంటాడో లేదో చూడాలి.
అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు
అయితే హరిహర వీరమల్లు చిత్రం ఈ టార్గెట్ ని రీచ్ కావడం అంత కష్టమేమి కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే తప్పకుండా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 35 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
కోహినూర్ డైమండ్ నేపథ్యంలో కథ
ఈ చిత్ర కథ కోహినూర్ డైమండ్, మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన అరాచకాల నేపథ్యంలో ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ మూవీలో క్లైమాక్స్ లో వచ్చే 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కి తానే కొరియోగ్రఫీ చేసినట్లు పవన్ తెలిపారు.