MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలు మ్యారేజే చేసుకోవద్దనుకున్నా.. మూడు పెళ్లిళ్ల రహస్యం బయటపెట్టిన పవన్‌.. ఊర కుక్కలతో సమానమంటూ బాలయ్య బాంబ్

అసలు మ్యారేజే చేసుకోవద్దనుకున్నా.. మూడు పెళ్లిళ్ల రహస్యం బయటపెట్టిన పవన్‌.. ఊర కుక్కలతో సమానమంటూ బాలయ్య బాంబ్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా సర్వర్లు క్రాష్ అయ్యాయి. అంతలా బాలయ్య షోకి క్రేజ్ నెలకొంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 03 2023, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కాగా సర్వర్లు క్రాష్ అయ్యాయి. అంతలా బాలయ్య షోకి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాజరైన ఎపిసోడ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అభిమానుల నిరీక్షణకి తెరదించుతూ.. పవన్, బాలయ్య తొలి ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ మొదలైంది. బాలయ్య పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఇక తన వ్యక్తిగత జీవితం.. 3 పెళ్లిళ్లపై పవన్ ఓపెన్ అవుతాడా ? ఇలా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అనుకున్నట్లుగా తన పెళ్లిళ్ల గురించి బయట జరుగుతున్న చర్చకి ఎదురవుతున్న విమర్శలకు పవన్ అన్ స్టాపబుల్ వేదికగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 

36

ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా అని బాలయ్య ప్రశ్నించగా.. తన మొదటి పెళ్లి నుంచి అన్ని వివరాలు పూసగుచ్చినట్లు వివరించారు. పవన్ సమాధానం ఇస్తూ.. నాకు మొదటి వివాహం జరిగే సమయానికి పెళ్లి అంటే సరైన అవగాహన లేదు. పెళ్ళికి ప్రిపేర్ గా లేను. కానీ కుటుంబ సభ్యులు వివాహం చేశారు. దీనితో మొదటి భార్యతో అభిప్రాయాలు కుదర్లేదు. అందుకే విడిపోవాల్సి వచ్చింది. 

46
Pawan Kalyan

Pawan Kalyan

ఇక రెండవ భార్యతో కూడా అభిప్రాయాలు కుదర్లేదట. రెండవ పెళ్లి కూడా పోయింది. ఆ తర్వాత మూడవ వివాహం చేసుకున్నాను అని పవన్ తెలిపారు. అయితే తనకు మొదట పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు అని పవన్ తెలిపాడు. ఒక యోగిలాగా మారుదామని అనుకున్నా. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలనే ఆలోచన ఉండేది. కానీ అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది. 

56
Pawan Kalyan

Pawan Kalyan

ఇక రాజకీయంగా పెళ్లిళ్ల విషయంలోనే నన్ను విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే నన్ను తిట్టడానికి వాళ్ళకి నాలో ఇంకేమీ లేదు. అందుకే ఈ పాయింట్ తీసుకుని తిడుతుంటారు. నేను కూడా వాళ్ళని తిరిగి తిట్టొచ్చు. కానీ నాకు సంస్కారం అడ్డు వస్తోంది. 

66
Pawan Kalyan-Renu Desai

Pawan Kalyan-Renu Desai

వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి. భార్య పిల్లలు ఉంటారు. నేను తిడితే వాళ్ళు బాధపడతారు. అందుకే వాళ్ళు తిట్టినా నేను సైలెంట్ గా ఉంటాను. ఆ సంస్కారం వాళ్ళకి లేదు. అందుకే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అని ఆలోచించలేకున్నారు అంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై బాలకృష్ణ స్పందించారు. ఇకపై మీ మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్‌ చేసిన వాడు ఊరకుక్కతో సమానం అంటూస్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వీరిద్దరి మధ్య చిట్‌ చాట్‌ ఆద్యంతం ఫన్నీగా సాగడం విశేషం.

 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved