- Home
- Entertainment
- సినిమాలు మానేయడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం
సినిమాలు మానేయడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విషయం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలు మానేస్తారా? అనే చర్చ నడుస్తుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు పవన్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pawan Kalyan
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాను మూడు సినిమాల్లో నటించాల్సి ఉండగా, వాటికి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. పవన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.
pawan Kalyan Harihara Veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. తాను మూడు సినిమాల్లో నటించాల్సి ఉండగా, వాటికి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. పవన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.
Pawan Kalyan
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ ని ఖుషీ చేసే విషయం వెల్లడించారు. తాను సినిమాలను వదిలేయబోనని స్పష్టం చేశారు.
తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు. తనకు ఆదాయ మార్గం సినిమాలే అని, వ్యాపారాలు లేవని తెలిపారు. సినిమాలు కంటిన్యూ చేస్తానని తెలిపారు.
pawan kalyan
ఓ వైపు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే ఉంటానని, వాటికి ఆటంకం కలగకుండా చూసుకుంటానని, టైమ్ దొరికినప్పుడు సినిమాలు చేస్తానని వెల్లడించారు. సినిమాలను చేస్తూ ప్రజలను దూరం చేసుకోనని, రెండింటిని బ్యాలెన్స్ చేస్తానని తెలిపారు.
ఈ వార్తతో దర్శక, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉండి పవన్ సినిమాలకు ఎక్కడ దూరమవుతాడో అనే ఆవేదన చెందుతున్న ఫ్యాన్స్ కిది శుభవార్త అని చెప్పొచ్చు.
OG
పవన్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`తో రాబోతున్నారు. ఈ మూవీ మే లో విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఆ తర్వాత `ఓజీ` మూవీని పవన్ పూర్తి చేస్తాడని తెలుస్తుంది.
దీంతోపాటు హరీష్ శంకర్ తో చేయాల్సిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ ఆగిపోతుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో ఆ మూవీ ఉంటుందని ఇటీవల నిర్మాత రవిశంకర్ తెలిపారు. కథని హరీష్ మరింత బలంగా తయారు చేశాడని, అది భారీ స్థాయిలో ఉండబోతుందని వెల్లడించారు.
read more: ఆ దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ డైరెక్టర్