RRR Postpone: అద్భుతమైన ఛాన్స్ ని మిస్ చేసుకున్న చిరంజీవి, పవన్.. జాక్‌పాట్ కొట్టిన నాగ్?
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఊహించని విధంగా వచ్చిన బిగ్ ఛాన్స్ ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. దీంతో కింగ్ నాగార్జున జాక్‌పాట్ కొట్టబోతున్నారు. సింగిల్‌గా టాలీవుడ్‌ని దున్నేయబోతున్నాడు. ఇంతకి ఆ కథేంటంటే..
అనుకున్నట్టే జరుగుతుంది. ఇండియన్ ప్రస్టీజియస్ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా పడింది. కరోనా దెబ్బకి థియేటర్లు మూతబడుతున్నాయి. కేరళా, తమిళనాడు, మహారాష్ట్రలో యాభై శాతం కెపాసిటీతో సినిమా థియేటర్లని రన్ చేయాలని ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి. ఢిల్లీలో ఏకంగా థియేటర్లని మూసేస్తున్న ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు జనం గుమిగూడే విభాగాలైన థియేటర్లపై ఆంక్షలు పెంచాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. దర్శకుడు రాజమౌళి టీమ్ `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదాకి నిర్ణయం తీసుకుంటున్నారని టాక్. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమాని వాయిదా వేసుకోవడానికి కారణం.. ఇది పాన్ ఇండియా సినిమా. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దేశ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో సినిమాని విడుదలకు ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. హిందీలో, తమిళనాడులో పూర్తి చేసుకుని ప్రస్తుతం కేరళాలో ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఆ తర్వాత బెంగుళూరు, తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేయాల్సి ఉంది. జనవరి 7న భారీగా రిలీజ్‌కి ప్లాన్ చేశారు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ స్థాయిలో రిలీజ్ ఉండాల్సిందే. వెయ్యి కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది `ఆర్‌ఆర్‌ఆర్`. కానీ ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో సాధ్యం కాదు. అంతేకాదు బడ్జెట్ డబ్బులు కూడా రావడం కష్టంగా మారిన నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్`ని వాయిదా వేసుకోవాలని నిర్ణయంచుకున్నట్టు టాక్.
మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్` బాటలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` సినిమా కూడా ఉండనుందనే టాక్ వినిపిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేస్తూ అభిమానులకు, ప్రజలకు విషెస్ తెలిపింది `రాధేశ్యామ్` యూనిట్. ఇందులో ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 14న సినిమాని విడుదల తేదీని వెల్లడించింది. అయితే `రాధేశ్యామ్` కూడా పాన్ ఇండియా చిత్రం. ఇండియన్ అన్ని లాంగ్వేజెస్‌తోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతుంది. దీంతో కరోనా కారణంగా ప్రభుత్వాలు పెట్టిన ఆంక్షలు సినిమా కలెక్షన్లపై భారీ దెబ్బ పడే ఛాన్స్ ఉంది. అందుకే `ఆర్‌ఆర్‌ఆర్` బాటలోనే `రాధేశ్యామ్` కూడా వాయిదా పడబోతుందనే వార్త సోషల్ మీడియాలో ఊపందుకుంది. మరి దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
రెండు భారీ సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆ స్పేస్‌ని భర్తీ చేసేందుకు పెద్ద సినిమాలు రెడీగా లేకపోవడం గమనార్హం. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ వెనకబడ్డారు. గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలని భావించారు. కానీ `ఆర్‌ఆర్‌ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాల కోసం వాయిదా వేసుకున్నారు. దీంతో ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ రెండు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడబోతున్న నేపథ్యంలో సంక్రాంతి సీజన్‌ని వాడుకునే ఛాన్స్ పవన్‌కి వచ్చిందని చెప్పొచ్చు. కానీ అందుకు సినిమా రెడీగా లేకపోవడం విచారకరం.
`భీమ్లా నాయక్` వాయిదా పడటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడంలో గ్యాప్ తీసుకుంది యూనిట్. దాదాపు రెండు నెలలు టైమ్ ఉండటంతో రిలాక్స్ అయిపోయారట. దీంతో ఇంకా చాలా వర్క్ పెండింగ్‌లో ఉందని, అది ఇప్పట్లో పూర్తి కాదని తెలుస్తుంది. దీంతో ఓ అద్భుతమైన ఛాన్స్ ని `భీమ్లా నాయక్` వదులకున్నాడనే చెప్పాలి. ఒకవేళ సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్` డేట్ కి బరిలోకి దిగితే కలెక్షన్ల వర్షం కురిసేంది. ఎందుకంటే `భీమ్లా నాయక్` కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల కానుంది. ప్రస్తుతం మన వద్ద పెద్దగా కరోనా ఆంక్షలు లేవు. ఇది కలిసొచ్చే అంశం. కానీ పవన్ అందుకు సిద్ధంగా లేడనే టాక్ అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది. మరి ఈ లోపు ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో చూడాలి.
మరోవైపు చిరంజీవి కూడా ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీగా లేడని టాక్. ఆయన నటించిన `ఆచార్య` సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది. మొన్నటి వరకు సినిమా షూటింగ్ వర్క్ నిర్వహించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. `అఖండ` దెబ్బకి `ఆచార్య`లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఎలివేషన్ సీన్లు లేకపోవడంతో ఆ దిశగా దర్శకుడు కొరటాల దృష్టిపెట్టారని, ఇంకా వర్క్ చేస్తున్నారని సమాచారం. అందుకు ఇంకా ఇరవై రోజుల టైమ్ పట్టే ఛాన్స్ ఉందట. కానీ ఒకవేళ ఇప్పటికే `ఆచార్య` సినిమా రెడీగా ఉంటే ఈ సంక్రాంతి బరిలో దిగితే ఓ వైపు తమ్ముడు పవన్, మరోవైపు అన్న చిరంజీవి సంక్రాంతికి మోత మోగించేవాళ్లు. కానీ ఆ అదృష్టాన్ని వీరిద్దరు వదులుకున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.
దీంతో ఇప్పుడు కింగ్ నాగార్జున జాక్‌పాట్ కొట్టబోతున్నారట. నాగార్జున, నాగచైతన్య నటించిన `బంగార్రాజు` సంక్రాంతి సీజన్ కోసం కాచుకుని కూర్చున్నాడు. పెద్ద సినిమాలు వాయిదా పడితే సంక్రాంతికి దించాలని ప్లాన్ చేస్తున్నాడు. నాగ్ ఊహించినట్టే `ఆర్‌ఆర్‌ఆర్`, `రాధేశ్యామ్` చిత్రాలు వాయిదా పడబోతున్నాయి. దీంతో సినిమా పూర్తి చేసుకుని రెడీగా ఉన్న నాగ్ ఇప్పుడు జాక్‌పాట్ కొట్టబోతున్నాడని చెప్పొచ్చు. ఎలాంటి పోటీ లేకుండా సంక్రాంతికి `బంగార్రాజు`తో మోత మోగించబోతున్నాడు నాగ్. వీటితోపాలు కొన్ని చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు ఇప్పుడే ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తంగా పెద్ద సినిమాల విషయంలో నాగార్జున `బంగార్రాజు` మాత్రమే బరిలో ఉండటంతో దానికి తిరుగే లేదని, కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతి కోడి పందెం మాదిరిగా ఎలాంటి పోటీ లేకుండానే విన్నర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. కలెక్షన్ల వర్షం కురవబోతుందని చెప్పొచ్చు.