#justiceforpunjabigirl... సోషల్ మీడియాలో పవన్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ, మేడం మీకు అండగా మేము ఉన్నాం అంటూ!
గత మూడు రోజులుగా సోషల్ మీడియా రావణకాష్టంలా రగిలిపోతుంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ మంత్రులను సన్నాసులు, వెధవలు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఈ విధంగా నష్టం చేస్తుందో పవన్ చెప్పాలన్న పేర్ని నాని, నేను సన్నాసైతే నువ్వు సన్నాసిన్నర అంటూ సెటైర్స్ వేశారు.
ఇక నిన్న నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యక్షంగా పవన్ పై పలు ఆరోపణలు చేసిన పోసాని, అవకాశాల పేరుతో పంజాబీ అమ్మాయిని లొంగదీసుకుని గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తిని, పవన్ పట్టుకోవాలని, ప్రశ్నించాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ పూనమ్ కౌర్ జీవితంతో ఆడుకున్న నీవా... స్త్రీల రక్షణ, భద్రత గురించి మాట్లాడేదని పోసాని ఇండైరెక్ట్ గా పవన్ ని ప్రశ్నించాడు. తనపై వైసీపీ కుక్కలను వదిలిందంటూ పవన్ పరోక్షంగా ట్వీట్ ద్వారా పోసాని ప్రెస్ మీట్ గురించి స్పందించడం జరిగింది.
పోసాని కామెంట్స్ జనసేన కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా, పవన్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. పవన్ పై నెగిటివ్ ట్యాగ్స్ తో విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా #justiceforpunjabigirl అనే ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ కావడం విశేషం.
పూనమ్ కౌర్ పలు సందర్భాల్లో పవన్ ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా సోషల్ మీడియాలో తన ఆవేదన తెలియజేశారు. ఇక ఈ విషయంపై దివంగత కత్తి మహేష్ ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. పవన్, త్రివిక్రమ్ కలిసి, పూనమ్ కౌర్ జీవితంతో ఆడుకున్నారని ఆయన ఆరోపించారు.
అది జరిగి చాలా కాలం అవుతుండగా, సద్దుమణిగింది అనుకుంటున్న ఈ విషయాన్ని తాజాగా పోసాని తెరపైకి తెచ్చారు. పూనమ్ పేరు ఎత్తకుండా పంజాబీ గర్ల్ అంటూ, అందరికీ అర్థం అయ్యేలా పవన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.