- Home
- Entertainment
- Bheemla Nayak review: భీమ్లా నాయక్ ప్రీమియర్ షో టాక్.. పీకే, రానా ఊచకోత..థియేటర్స్ టాప్ లేచిపోతున్నాయి
Bheemla Nayak review: భీమ్లా నాయక్ ప్రీమియర్ షో టాక్.. పీకే, రానా ఊచకోత..థియేటర్స్ టాప్ లేచిపోతున్నాయి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్.
పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. యూఎస్ తో పాటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఎక్కడ చూసిన థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ప్రీమియర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. భీమ్లా నాయక్ చిత్రానికి యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
అడవి గురించి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలతో భీమ్లా నాయక్ సినిమా మొదలవుతుంది. స్టార్టింగ్ నుంచే పవన్ కళ్యాణ్, రానా మధ్య ఇగో క్లాష్ మొదలవుతుంది. ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్.. రానా పై కేసు నమోదు చేస్తాడు. దీనితో ఇద్దరి మధ్య అసలైన వార్ మొదలవుతుంది. భీమ్లా, డానియల్ వార్ లో మొదటి దెబ్బ భీమ్లా నాయక్ కే పడుతుంది. దీనితో ఇద్దరి మధ్య యుద్ధం మరింత ఇంటెన్స్ గా మారుతుంది.
ఇంతలో నిత్యామీనన్ ఎంట్రీ, భీమ్లా నాయక్ సాంగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. భీమ్లా నాయక్ సాంగ్ లో ఆడియన్స్ కి ఓ సర్ ప్రైజ్ ఉంది. పోలీస్ స్టేషన్ లో వచ్చే డైలాగ్స్ లో త్రివిక్రమ్ పెన్ను పవర్ కనిపిస్తుంది. ప్రతి డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా మరో ఎదురు దెబ్బ ఎదుర్కొంటాడు. దీనితో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఆ తర్వాత పవన్ నటన, మాస్ ఎలివేషన్స్ అదిరిపోతాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే లాలా భీమ్లా సాంగ్ థియేటర్స్ టాప్ లేచిపోయేలా ఉంది. పిక్చరైజేషన్ టాప్ నాచ్ అనే చెప్పాలి. ఇక వెంటనే పవన్ కళ్యాణ్, రానా మధ్య అద్భుతమైన ఫేస్ ఆఫ్ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
ఓవరాల్ గా ఇంటర్వెల్ వరకు భీమ్లా నాయక్ చిత్రం పవర్ ఫుల్ గా ఉంటూ ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతి కల్గించిందనే చెప్పాలి. కొందమంది ప్రేక్షకులు చెబుతున్న దాని ప్రకారం భీమ్లా నాయక్ లో పీకే, రానా మధ్య సన్నివేశాలు ఒరిజినల్ వర్షన్ అయ్యప్పన్ కోషియం కంటే చాలా బెటర్ గా ఉన్నాయని అంటున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. రచయితగా త్రివిక్రమ్, దర్శకుడిగా సాగర్ చంద్ర పదునైన పనితనం కనబరిచారని.
ఇక్కడ అస్సలు మరచిపోకూడని మరో అంశం మ్యూజిక్ సెన్సేషన్ థమన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు పెట్టుకున్న విధంగానే తమన్ ఏమాత్రం నిరాశ పరచలేదు. అంచనాలకంటే రెట్టింపుగానే తన బిజియంతో అదరగొట్టాడు. తమన్ బిజియం.. పవన్, రానా మధ్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలలో అగ్నికి వాయువు తోడైనట్లు అయింది. దీనితో ప్రేక్షకులు థియేటర్స్ లో ట్రాన్స్ లోకి వెళుతూ మాస్ జాతారని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్, క్లయిమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ కి త్రివిక్రమ్ రచన అద్భుతంగా వర్కౌట్ అయింది. మొత్తంగా భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రీమియర్స్ నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ నమోదవుతున్నాయి.
దర్శకుడు సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం మొదటి నుంచి పవన్ హైలైట్ అవుతూ వస్తున్నాడు. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో మతిపోగోట్టేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఓవరాల్ గా భీమ్లా నాయక్ చిత్రం గబ్బర్ సింగ్ లాంటి ఊర మాస్ మూవీ.