MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ పాలిటిక్సే వద్దు.. పవన్ ని అడగాల్సినవన్నీ అడిగేసిన బాలయ్య.. చిరు గురించి హాట్ క్వశ్చన్

ఈ పాలిటిక్సే వద్దు.. పవన్ ని అడగాల్సినవన్నీ అడిగేసిన బాలయ్య.. చిరు గురించి హాట్ క్వశ్చన్

నటసింహం నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఒక వైపు సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. మరోవైపు అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో పెద్ద హంగామానే చేస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 20 2023, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటసింహం నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఒక వైపు సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. మరోవైపు అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో పెద్ద హంగామానే చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజమౌళి, ప్రభాస్ ఇలా ప్రముఖులంతా బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ప్రభాస్ హాజరైన ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది. దీనితో బాలయ్య, పవన్ ఎపిసోడ్ పై విపరీతమైన హైప్ నెలకొంది. వీళ్లిద్దరి కలయికపై పొలిటికల్ గా కూడా తెగ చర్చ జరుగుతోంది. 

36

జనసేన పార్టీ, టిడిపి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండడంతో బాలయ్య.. పవన్ మధ్య ఈ షోలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. పైగా బాలయ్య ఈ షోలో సెలెబ్రటీలని ఊహించని ప్రశ్నలతో ముప్పతిప్పలు పెడుతున్నారు. తాజాగా పవన్ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న టీజర్ ని ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే బాలయ్య, పవన్ మధ్య స్పష్టమైన పొలిటికల్ చర్చ జరిగినట్లు అర్థం అవుతోంది. 

46

తనని బాల అని పిలవమని బాలయ్య పవన్ ని అడుగుతారు. తాను ఓడిపోవడానికి కూడా సిద్ధం అని కానీ అలా చేయను అని పవన్ బదులిస్తాడు. వెంటనే ఈ పాలిటిక్సే వద్దు అని బాలయ్య అనడం ఆకట్టుకుంటోంది. ఈ మధ్యన మీ విమర్శల్లో వాడి వేడి బాగా పెరిగింది అని బాలయ్య అనగా.. లేదండి నేను చాలా పద్దతిగా మాట్లాడతాను అని పవన్ ఫన్నీగా చెప్పడం నవ్వులు పూయించింది. 

 

56

మీకు చిరంజీవి గారు అన్నయ్య.. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి ఏంటి.. వద్దనుకున్నవి ఏంటి ? అంటూ బాలయ్య హాట్ క్వశ్చన్ రైజ్ చేశారు. దీనితో పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ గారి గురించి ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు స్పష్టంగా పవన్ ఏం సమాధానం ఇచ్చారో తెలియాలంటే కంప్లీట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

66

నీపై ఫ్యాన్స్ లో ఉన్న అభిమానం అంతా ఎందుకు ఓట్లుగా కన్వర్ట్ కాలేదు అని కూడా బాలయ్య  పవన్ ని ప్రశ్నించారు. నెమ్మదిగా ఆహా సంస్థ పవన్ ఎపిసోడ్ టీజర్స్ రిలీజ్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved