Pavitra Lokesh: పవిత్ర లోకేష్ కి బిగ్ షాక్.. రెండు పెద్ద చిత్రాల నుంచి అవుట్ ?
గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అధికారికంగా అంగీకరించడం లేదు.

గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అధికారికంగా అంగీకరించడం లేదు. అలాగే ఖండించడం కూడా లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతున్నారు.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. మైసూర్ లోని ఓ హోటల్ లో వీరిద్దరిని ఎక్స్ పోజ్ చేసింది. దీనితో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. నరేష్, రమ్య ఒకరిపై ఒకరు తీవ్య్రా ఆరోపణలు చేసుకుంటున్నారు. నరేష్ వుమెనైజర్ అంటూ రమ్య మీడియా ముందు తీవ్రంగా ఆరోపించింది. అలాగే నరేష్ మాట్లాడుతూ.. రమ్య చీటర్ అని.. ఆమె చేసిన అప్పులు, మోసాల వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆరోపించారు.
ఇక పవిత్ర లోకేష్ కూడా రమ్య అనవసరంగా తన పరువుకి భంగం కలిగించేలా బెంగుళూరుకి వచ్చి ఆరోపణలు చేస్తోంది అని వాపోయింది. తనని, నరేష్ ని అందరూ సపోర్ట్ చేయాలని కోరింది. ఇక మైసూర్ హోటల్ వ్యవహారం విషయంలో పవిత్రపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
ఇదిలా ఉండగా తాజాగా పవిత్ర లోకేష్ కి ఊహించని షాక్ ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో తల్లి పాత్రలకు బాగా ఫేమస్. దువ్వాడ జగన్నాధం, జై లవకుశ, సర్కారు వారి పాట ఇలా ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించింది.
ప్రస్తుతం నరేష్ తో జరుగుతున్న వ్యవహారంతో ఆమె తల్లి పత్రాలు చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో రెండు పెద్ద చిత్రాల్లో ఆమె ఆఫర్స్ కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
పవిత్ర లోకేష్, నరేష్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు అని రూమర్స్ రావడంతో ఈ వివాదం ముదిరింది. నరేష్ మూడో భార్య రమ్య విడాకుల సమస్య ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులో ఉంది.