- Home
- Entertainment
- Pavitra Lokesh:హోటల్ ఘటనపై పవిత్ర భర్త సుచేంద్ర ఊహించని కామెంట్స్.. అవసరమైనప్పుడు బయట పెడతా అంటూ ట్విస్ట్
Pavitra Lokesh:హోటల్ ఘటనపై పవిత్ర భర్త సుచేంద్ర ఊహించని కామెంట్స్.. అవసరమైనప్పుడు బయట పెడతా అంటూ ట్విస్ట్
గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో వీరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో వీరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మైసూర్ లో పవిత్ర, నరేష్ ఒకే గదిలో ఉండడం.. అక్కడికి వెళ్లిన నరేష్ భార్య వీరిద్దరి రిలేషన్ ని బట్టబయలు చేయడంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది.
ఇక నరేష్, అతడి మూడో భార్య రమ్య ఒకరిపై ఒకరు పబ్లిక్ గా తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. నరేష్ వుమెనైజర్ అంటూ రమ్య మీడియా ముందు తీవ్రంగా ఆరోపించింది. అలాగే నరేష్ మాట్లాడుతూ.. రమ్య చీటర్ అని.. ఆమె చేసిన అప్పులు, మోసాల వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. పవిత్ర లోకేష్ కి కాపురాలు కూల్చే అలవాటు ఉంది అంటూ సుచేంద్ర కామెంట్స్ చేసినట్లు కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే సుచేంద్ర ఈ కామెంట్స్ నిజంగానే చేశారా లేక ఆయన మాట్లాడినట్లు సృష్టించారా అనేది క్లారిటీ లేదు.
అయితే సుచేంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం గతంలో వైరల్ అయిన కామెంట్స్ కి పూర్తి భిన్నంగా ఉన్నాయి. సుచేంద్ర తాజాగా మీడియా ముందు తన భార్య పవిత్రని వెనకేసుకొని వస్తూ పాజిటివ్ గా మాట్లాడారు. మైసూర్ లో హోటల్ సంఘటన జరగడం దురదృష్టకరం అని సుచేంద్ర అన్నారు.
Naresh-Pavitra Lokesh
ఆ సంఘటన తర్వాత పవిత్ర నాకు ఫోన్ చేసింది. ఏం జరిగిందో వివరించింది. తన భార్య తప్పు చేయదని, నాకు ఆ నమ్మకం ఉందని సుచేంద్ర ఊహించని కామెంట్స్ చేశారు. అయితే పవిత్ర.. తమకి పెళ్లి కాలేదని ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. మా ఇద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇప్పటికి మేమిద్దరం భార్య భర్తలమే అని సుచేంద్ర అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంలోకి మా ఫ్యామిలీని లాగొద్దని.. మా పిల్లలకు ఈ విషయం తెలియదు అని సుచేంద్ర అన్నారు. రమ్యతో ఉన్న పవర్ టివి అధినేత రాకేష్ శెట్టి ఎవరో కూడా తనకు తెలియదు అని సుచేంద్ర క్లారిటీ ఇచ్చారు.
అయితే పవిత్ర తమది సహజీవనం మాత్రమే అని ఎందుకు చెబుతోందో తెలియదు అని అన్నారు. హిందూ సంప్రదాయంలో జరిగే వివాహాల్లో ఎక్కువగా మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రస్తావన ఉండదు. కాబట్టి మా మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు. కానీ పెళ్ళికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని బయటపెడతా అని సుచేంద్ర అన్నారు.