- Home
- Entertainment
- నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి కొడతారు అని వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు, మహిళా అభిమానుల కోసం బాధపడిన రెబల్ స్టార్
నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి కొడతారు అని వార్నింగ్ ఇచ్చిన కృష్ణంరాజు, మహిళా అభిమానుల కోసం బాధపడిన రెబల్ స్టార్
కృష్ణంరాజు నటించిన ఒక మూవీ టైటిల్ మార్చమని రచయిత పరుచూరి గోపాల కృష్ణ అడిగారు. దీనికి కృష్ణం రాజు ఎలాంటి సమాధానం ఇచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

కృష్ణంరాజుపై పరుచూరి కామెంట్స్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఓ మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ సమయంలో చిరంజీవి ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పరుచూరి బ్రదర్స్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆ టైంలో పరుచూరి బ్రదర్స్ కృష్ణంరాజు నటించిన బాబులుగాడి దెబ్బ అనే చిత్రానికి రచయితలుగా పనిచేశారు.
ఆ టైటిల్ వద్దని చెప్పిన పరుచూరి
పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి కోసం మేము పనిచేసిన చిత్రం బాబులుగాడి దెబ్బ. ఆ తర్వాత రారాజు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి చిత్రాలకు పనిచేశాం అని అన్నారు. బాబులుగాడి దెబ్బ చిత్రానికి పనిచేస్తున్నప్పుడు తాను కృష్ణం రాజు గారికి ఒక విషయం చెప్పానని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. అందేటంటే సార్.. ఈ చిత్రానికి బాబులుగాడి దెబ్బ అనే టైల్ వద్దు.. జస్ట్ బాబులుగాడు అని మాత్రమే పెట్టండి అని అడిగాను.
నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి కొడతారు
బాబులుగాడి దెబ్బ అంటే లేడీస్ కి ఆ టైటిల్ పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది. రాంగ్ టోన్ లో వినిపిస్తుంది. కాబట్టి మార్చండి సార్ అని అడిగాను. నేను ఈ విషయం బయట చెబితే నా ఫ్యాన్స్ లారీల్లో వచ్చి నిన్ను కొడతారు. వాళ్ళకి మాస్ టైటిల్స్ ఇష్టం అని కృష్ణం రాజు అన్నారు. దీనితో నేను సైలెంట్ అయిపోయాను.
బొబ్బిలి బ్రహ్మన్న షూటింగ్
ఆ తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి పనిచేశాం. రాఘవేంద్ర రావు దర్శకుడు. కథ అద్భుతంగా వచ్చింది. గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ వేలాదిగా కృష్ణం రాజు గారిని చూడ్డానికి వచ్చారు. కృష్ణంరాజు సొంత ప్రాంతం గోదావరి కాబట్టి తొలిసారి వాళ్ళ ఇంట్లో రాచ మర్యాదలతో మాకు విందు ఏర్పాటు చేశారు.
బాధపడిని కృష్ణంరాజు
షూటింగ్ సమయంలో మహిళా ఫ్యాన్స్ కూడా కృష్ణంరాజు గారిని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు కృష్ణం రాజుతో మాట్లాడుతూ.. మీరు చివరగా చేసిన చిత్రం చూశాం, చాలా బావుంది. కానీ ఆ టైటిల్ మా ఆడవాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపించింది అని అన్నారు. దీనితో కృష్ణంరాజు బాధపడుతూ పరుచూరి గోపాల కృష్ణ మాట విని ఉండాల్సింది అని అన్నారట.