- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9లో తెలంగాణ అమ్మాయి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా
బిగ్ బాస్ తెలుగు 9లో తెలంగాణ అమ్మాయి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా
బిగ్ బాస్ తెలుగు 9లోకి తెలంగాణ అమ్మాయి అడుగుపెట్టబోతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ అయినా ఆమె గురించి ఈ విషయాలు తెలుసుకోండి.

బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ప్రధాన షో కంటే ముందుగా ఆగష్టు 22 నుంచి బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష పేరుతో ప్రీ షో నిర్వహించబోతున్నారు. ఈ షోలో బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొనే కామనర్స్ ఎంపిక జరుగుతుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి తెలంగాణ అమ్మాయి
కామనర్స్ ని ఎంపిక చేసేందుకు మాజీ బిగ్ బాస్ విన్నర్ అభిజీత్, నవదీప్, బిందుమాధవి రంగంలోకి దిగారు. ఈ ప్రక్రియని ఆగష్టు 22 నుంచి జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ముగిసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష నుంచి కొన్ని లీకులు బయటకి వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు తెలంగాణకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం అనే అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి..
దీనితో ఆమెకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనూష రత్నం తెలంగాణ అమ్మాయే. వరంగల్ లో పుట్టి పెరిగింది. ఎమ్మేసి చదువుకుని సాఫ్ట్ వేర్ టెక్కీగా రాణించింది. అయితే ఆమెకి సినిమా రంగం, సోషల్ మీడియాపై ఆసక్తి ఎక్కువ. దీనితో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. ఇంస్టాగ్రామ్ లో ఆమెకి 2 లక్షల 70 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
యాంకర్ గా అవకాశాలు
ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో కూడా అనూషకి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె యాంకర్ గా కూడా ఆఫర్స్ అందుకుంటోంది. హీరో నాని, ఆనంద్ దేవరకొండ, విజయ్ ఆంటోని లాంటి హీరోలతో సినిమా ప్రమోషన్స్ కూడా చేసింది. ఆమె చేస్తున్న రీల్స్ బాగా వైరల్ అవుతుంటాయి.
తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్
సోషల్ మీడియాలో తన లైఫ్ గురించి కూడా అనూష తన ఫాలోవర్స్ కి చెబుతూ ఉంటుంది. తన తండ్రి మద్యం, స్మోకింగ్ వల్ల మరణించారని.. అందరూ వాటికి దూరంగా ఉండాలని అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేసింది. డాక్టర్ హెచ్చరించినప్పటికీ తన తండ్రి ఆ అలవాట్లు కొనసాగించడంతో మరణించినట్లు పేర్కొంది. టాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నిస్తున్న అనూష రత్నంకి బిగ్ బాస్ తెలుగు 9 లో ఛాన్స్ రావడం తొలి అడుగు పడినట్లే అని భావించొచ్చు.