పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్ళి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక
పరిణితీ చోప్రా- రాఘవ్ చద్దాల పెళ్ళికి అందా రెడీ అయ్యింది. వీరి పెళ్లిని ఘనంగా జరిపించడం కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇంతకీ పెళ్ళి డేట్ ఎప్పుడు.. విశేషాలేంటి.
Image: Parineeti Chopra / Instagram
బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పరిణీతి చోప్రా, ఢిల్లీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్ళి అంతా సిద్దం అవుతోంది. వీరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ స్టార్ సెలబ్రెటీ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుందని సమాచారం. పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు అతిథుల కోసం ఈ జంట స్వయంగా ఏర్పాట్లు పర్యావేక్షిస్తున్నారట. లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బుక్ చేస్తున్నారని తెలిసింది.
Parineeti Chopra and Raghav Chadha
ఈ నెల 17 నుంచే పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయని వారి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 17 నుంచి వారి సాంప్రదాయం ప్రకారం ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసి.. 23 నుంచి మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి కార్యక్రమాలు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక పెళ్ళి తరువాత సెప్టెంబర్ 30న చండీగఢ్‌లోని తాజ్ హోటల్‌లో స్నేహితులు, కుటుంబసభ్యులకు విందు ఇవ్వనున్నారు జంట.
కాగా, ఈ నెల 23, 24 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సిటీలోగల హోటల్ లీలా ప్యాలెస్ అండ్ ఉదయవిలాస్‌లో కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చురగ్గు సాగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వారికి అత్యంత సన్నిహితులు, స్నేహితుల కోసం కూడా ప్రత్యేకంగా లంచ్ రిసెప్షన్ ప్లాన్ చేశారట. పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం పలుకుతూ పోస్టు చేసిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఇద్దరు సెలెబ్రిటీలు ఈ నెల 23న వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు.అంతే కాదు.. ఈ వేడుకల్లో భాగంగా అతిథుల కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఉదయ్ పూర్ పోలీసులు వీరి పెళ్లికి భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ పెళ్లికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా వీవీఐపీలు హాజరయ్యే అవకాశం ఉందని సెక్యూరిటీ పటిష్ఠం చేశారు.
పరిణీతి, రాఘవ్ లకు మే 13న ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాఘవ్ చద్దా నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి వీరి వివాహ వేడుకకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నవంబర్ లో వీరి పెళ్ళి అంటూ ముందుగా ప్రచారం జరిగింది. కాని ఈనెలలోనే జరగబోతున్నట్టు ఆతరువాత తెలిసింది. ఇక ప్రస్తుతం ఈజంట ఉదయ్ పూర్ కు వెళ్లింది. అక్కడ పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం.
పెళ్లికి వస్తారా రారా అనే విషయంలో క్లారిటీ లేదు కాని.. రిసెప్షన్‌కు పరిణీతి చోప్రా సోదరి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ కూడా హాజరుకానున్నారు.ఈ క్రమంలో విందుకు సంబంధించిన ఇన్విటేషన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఇన్విటేషన్ కార్డు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుపు రంగులో ఉన్న ఇన్విటేషన్ కార్డు చుట్టూ బంగారు వర్ణం డిజైన్ ఉంది. మధ్యలో నీలం రంగులో అక్షరాలు ఉన్నాయి.