- Home
- Entertainment
- intinti Gruhalakshmi: కొడుక్కి చివాట్లు పెట్టిన పరంధామయ్య దంపతులు.. తులసికి రాయబారం పంపిస్తున్న నందు!
intinti Gruhalakshmi: కొడుక్కి చివాట్లు పెట్టిన పరంధామయ్య దంపతులు.. తులసికి రాయబారం పంపిస్తున్న నందు!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. సమస్యల్లో ఇరుక్కున్న మాజీ భర్తని రక్షించడం కోసం తపన పడుతున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో లాస్య దగ్గరికి వెళ్లి తప్పు చేశావు ఏమో అంటారు పరంధామయ్య దంపతులు. అలానే కోరుకుంటే సమస్య పెరిగే పెద్దదవుతుంది. నిన్నటి వరకు తన భర్త తనకి సారీ చెప్తే చాలు అనుకుంది లాస్య కానీ ఈరోజు కేకే కూడా అడుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఇంకేం అడుగుతుందో అందుకే వెళ్ళాను. ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతే బాగుంటుంది అంటుంది తులసి.
అప్పుడే అక్కడికి వచ్చిన నందు సమస్య అంటున్నావేంటి ఆఫీసులో నీకు ఏదైనా సమస్య? ఆలోచిస్తే ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అంటాడు నందు.అదేంటో సమస్య పక్క వాళ్ళది అనేసరికి బోలెడన్ని పరిష్కారాలు వచ్చేస్తాయి అదే సమస్య మనది అంటే మనసుకి దిగులు వచ్చేస్తుంది అంటూ నందుని మాటల్లో పెట్టి లాస్ట్ ఏ దగ్గరికి వెళ్లి వచ్చిన విషయం చెప్తుంది తులసి.
అక్కడికి ఎందుకు వెళ్లావు అంటాడు నందు. మిమ్మల్ని చూసి అత్తమామలు బాధపడుతున్నారు వారు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు అందుకే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అని వెళ్లాను కానీ ఆమెకి అదే మొండితనం అదే మూర్ఖత్వం అంటుంది తులసి. నాకు కావలసింది కథ కాదు క్లైమాక్స్ అది చెప్పు చాలు అంటాడు నందు. కెఫే తన పేరు మీద రాసిస్తే క్లైమాక్స్ సుఖాంతం అవుతుంది.
రేపు వెళ్లి తనని ఇంటికి తీసుకురండి అలా అని నేను మాటిచ్చాను అంటుంది తులసి. అలా ఎలా మారుస్తావు నాకు ఏదైనా సమస్య వస్తే సలహా ఇవ్వు అంతేకానీ నా జీవితాన్ని గుప్పెట్లో తీసుకోవాలని అనుకోకు అయినా నా తరఫున మాట ఇవ్వటానికి నువ్వు ఎవరు అంటూ నోరు జారుతాడు నందు. ఇది తక్కువయి మీ సమస్యలు వేలు పెట్టాను అయినా ఎవరు ఎలా పోతే నాకేంటి మళ్లీ మీ జోలికి రాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
నువ్వు మాటలు అన్నది నీ మాజీ భార్యని కాదు నువ్వు కష్టంలో ఉంటే బాధపడే ఒక మంచి మనిషిని అయినా నీకు లాస్ ఇలాంటి భార్య ఏం కరెక్ట్ అంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పరంధామయ్య దంపతులు. మరోవైపు నా భర్త నా మాట వింటే తన మాట చెల్లదని మా అత్త కుట్రలు పన్నుతుంది ఎలా అయినా నా భర్తని కవ్వించి నా దగ్గరికి తెచ్చుకుంటాను.
దెబ్బకి మా అత్తగారి మొహం మాడిపోవాలి అనుకొని బసవయ్య గది వైపు వెళుతుంది దివ్య. అప్పటికే నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటాడు విక్రమ్. విక్రమ్ ని సైగల ద్వారా పిలుస్తుంది దివ్య. విక్రమ్ ఆనందంగా లేచి దివ్య దగ్గరికి వెళ్ళబోతాడు కానీ కాలికి బసవయ్య తాడు కడతాడు. అది తెలియని విక్రం మంచం మీద నుంచి దిగుతూనే పడిపోతాడు. దానితో బసవయ్యకి మెలకువ వచ్చి నువ్వు వెళ్ళిపోతావు అని నాకు తెలుసు అందుకే కాలికి తాడు కట్టాను అంటాడు. మెడకి కట్టవలసింది అంటూ కోపంగా అంటాడు విక్రమ్. విక్రమ్ పరిస్థితికి దివ్య నవ్వుకుంటుంది.
మరోవైపు పని చేసుకుంటున్నా తెలిసింది చూసి నిజంగానే అమ్మన్నట్లు ఒక మంచి మనసుని బాధపెట్టాను అనుకొని తులసి రాములమ్మ పనిచేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లి తులసికి సారీ చెప్తాడు నందు. మీరు నాకు సారీ చెప్పినా చెప్పకపోయినా ఒరిగేదేమీ లేదు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే కనీసం సమస్యలైనా తీరుతాయి అంటుంది తులసి. ఎందుకు నాకు ఇష్టం లేని పని నా చేత చేయిస్తావు. లాస్యతో జీవితం అనేది ముగిసిపోయిన కధ అంటాడు నందు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఆ తర్వాత తండ్రి పక్కన కూర్చొని నాకు తులసికి సంధి కుదర్చోచ్చు కదా అంటాడు నందు.
27 ఏళ్ల కిందట పెళ్లి సంబంధం కుదిర్చాను ఏం చేసావు అని దెప్పుతాడు పరంధామయ్య. ఒక పేపర్ తీసుకొని దానిమీద సారీ తులసి అని రాసి రాములమ్మకిచ్చి ఇవ్వమని చెప్తాడు నందు. తరువాయి భాగంలో దొంగ సాక్షులని తీసుకొని వస్తాడు మాధవి భర్త. కోర్టు దగ్గర తులసి వాళ్ళకి తనని కొట్టినట్లుగా ఎవిడెన్స్ చూపిస్తుంది లాస్య.