సందీప్ వంగాపై బాలీవుడ్ దర్శకుడు సెటైర్స్,కామెంట్స్
మొదటి నుంచీ సందీప్ రెడ్డి వంగా సినిమాలలో హింస ఎక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. పాతాళ్ లోక్ దర్శకుడు సుదీప్ శర్మ ఇటీవల వంగా సినిమాలలో హింసను ఖండించారు. వంగా ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు నుంచి వెళ్లి రీసెంట్ గా హిందీలో జెండా పాతిన దర్శకుడు సందీప్ వంగా. అయితే ఆయన సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందనేది అందరూ ఒప్పుకునే నిజం. అయితేనేం డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. లేటెస్ట్‌గా యానిమల్ మూవీ సూపర్ హిట్ తో సక్సెస్ ని మరోసారి ఎంజాయ్ చేసారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సక్సెస్ అందుకున్న సందీప్.. యానిమల్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వరుసగా హిట్ సినిమాలు చేసి హిట్స్ ఇస్తున్న సందీప్ కి బాలీవుడ్ లో ఓ రేంజిలో డిమాండ్ ఉంది. ఆయన తో చేయాలని అక్కడ హీరోలంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే సందీప్ మూడు సినిమాలకు ఓకే చెప్పినట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే అదే సమయంలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. బాలీవుడ్ ఆయనపై విరుచుకు పడటం మానలేదు.
Sandeep Reddy Vanga
రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగాపై పాతాళ్ లోక్ డైరక్టర్ సుదీప్ శర్మ కామెంట్స్ చేసారు. అమెజాన్ ప్రైమ్ కోసం సుదీప్ శర్మ లేటెస్ట్ గా పాతాల్ లోక్ 2 చేశారు. సీజన్ 1 సూపర్ హిట్ సుదీప్ శర్మా ఈ సీక్వెల్ తీసుకొచ్చారు. పాతాల్ లోక్ 2 సీజన్ 2 కూడా బాగానే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ... మాస్ చిత్రాలలో హింసాత్మక వర్ణన,ధోరణి ఎక్కువైపోయిందని అన్నారు.
" ఒక వ్యక్తి హోటల్లోకి ఓ గన్ తో వచ్చేసి 150 మందిని కాల్చేయటం, ఎవరూ ప్రశ్నించకపోవటం, పోలీస్ లు పట్టించుకోకపోవటం వంటివి హింసను ప్రేరేపిస్తాయని అన్నారు సుదీప్ వర్మ. బాగా పాపులర్ అయ్యిన సినిమాల్లో ఇలాంటి తీవ్రమైన హింసకు సంభందించిన సీన్స్ ఉండటం సామాజికంగా ఇబ్బందులు తెస్తాయని అన్నారు. డైరక్ట్ గా సందీప్ వంగా పేరు తీయకపోయినా ఈ కామెంట్ ఆయనకు సంభందించిందే అని బాలీవుడ్ మీడియా అంటోంది.
పాతాళ్ లోక్ డైరక్టర్ ఇంకా ఏమంటారంటే స్టోరీ టెల్లింగ్ లో హింస అనేది ప్రధాన అంశంగా తీసుకోకూడదని అంటున్నారు. తను చేసిన NH10,పాతాళ్ లోక్ సీరిస్ లలో సామాజిక సమస్యలు ఎలాంటి హింసను ప్రేరేపిస్తున్నాయనేది చూపించామన్నారు. హింసను ఎక్కువగా సినిమాల్లో చూపించటంతో అవి చాలా సాధారణ విషయంగా జనం భావిస్తారని, అవి దుష్పరిమాణాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు.
సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే...యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసారు సందీప్. ఇక క్యాస్టింగ్ సెలక్షన్ చేయాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని సందీప్ అనుకుంటున్నాని చెప్తున్నారు ఈ మూడు సినిమాలతో పాటుగా యానిమల్ సినిమాకు సీక్వెల్ యానమిల్ పార్క్‌ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. యానిమల్ మూవీ సూపర్ హిట్ కావడంతో యానిమల్ పార్క్‌పై మంచి హైప్ ఉంటుంది.