MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki: చెల్లిని కోల్పోయాను, జానకి మరణంపై పి సుశీల ఎమోషనల్ కామెంట్స్, కన్నీటి పర్యంతం అయిన గాయని

Janaki: చెల్లిని కోల్పోయాను, జానకి మరణంపై పి సుశీల ఎమోషనల్ కామెంట్స్, కన్నీటి పర్యంతం అయిన గాయని

Janaki: జానకి లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోలేం. జానకమ్మ లాంటి గొప్ప గాయని గొంతు వినే అదృష్టం ఈ తరానికి దక్కింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ బతికే ఉంటాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జానకితో తనకున్న అనుబంధం..
Image Credit : Instagram

జానకితో తనకున్న అనుబంధం..

ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూయడంతో ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు ఆమెకు తుది నివాళులు అర్పించారు. భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు అద్భుతమైన గాయనీమణులు ఎస్. జానకి, పి. సుశీల. సమకాలీనులైన వీరిద్దరూ తమ కోకిల కంఠంతో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు. ఇప్పుడు జానకితో తనకున్న అనుబంధం, స్నేహం, విభేదాల గురించి పి. సుశీల పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
50 ఏళ్లకు పైగా అనుబంధం
Image Credit : our own

50 ఏళ్లకు పైగా అనుబంధం

ఎస్. జానకి మరణం తన వ్యక్తిగత నష్టమని పి. సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. "50 ఏళ్లకు పైగా నాతో అనుబంధం ఉన్న నా ప్రాణ స్నేహితురాలు జానకి మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె ఇక లేరంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది" అని సుశీల ఓ సోషల్ మీడియా వీడియోలో తన బాధను పంచుకున్నారు.

35
చెల్లిని కోల్పోయాను
Image Credit : Asianet News

చెల్లిని కోల్పోయాను

మరో సందేశంలో, ఆ రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటని సుశీల అభివర్ణించారు. "నేను ఒక గొప్ప సహోద్యోగిని మాత్రమే కాదు, నా నిజమైన స్నేహితురాలిని, చెల్లిని కోల్పోయాను. మేమిద్దరం దాదాపు ఐదు దశాబ్దాలుగా సంగీతంలో కలిసి ప్రయాణించాం, ఎన్నో భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడాం" అని ఆమె చెప్పారు. "ఆమెకు సాటి రాగలవారు ఎవరూ లేరు. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో ఆమె స్థాయి గాయకులు మనకు లేరు" అని ఆమె అన్నారు. "'సింగారవలే దేవ' పాటను ఆమె పాడినట్టుగా మరెవరూ పాడలేరు. ఆ పాట ఆమెను నేపథ్య గానంలో శిఖరాగ్రానికి తీసుకెళ్లింది" అని సీనియర్ గాయని పి. సుశీల గుర్తుచేసుకున్నారు.

45
మా మధ్య గొడవలు పెట్టారు
Image Credit : our own

మా మధ్య గొడవలు పెట్టారు

"మేము కలిసి ఉన్నన్ని రోజులు చాలామంది మమ్మల్ని టార్గెట్ చేశారు. నా మీద ఆమెకు, ఆమె మీద నాకు చాడీలు చెప్పి మా మధ్య గొడవలు పెట్టి తమాషా చూశారు. ఇప్పుడు వాళ్లు చల్లగా ఉండాలి. ఇదంతా చేసి వాళ్లేం సాధించారు? ఆమెకు చావు లేదు. దేవుడి దగ్గరికి వెళ్లింది. ఈ అదృష్టం అందరికీ దక్కదు. ప్రజలు పుణ్యం చేసుకున్నారు కాబట్టే ఆమె మధురమైన గొంతు వినే అవకాశం దక్కింది" అని పి. సుశీల ఆవేదనగా మాట్లాడారు.

55
మనసువిప్పి మాట్లాడిన సుశీల..
Image Credit : stockPhoto

మనసువిప్పి మాట్లాడిన సుశీల..

ఎస్. జానకి, పి. సుశీల కలిసి ఎన్నో పాటలు పాడారు. కన్నడలో 'చదురంగ' సినిమాలోని 'మమతెయ తోటద మల్లిగెయె' పాట, 'చక్రవ్యూహ' చిత్రంలోని 'నిజ హెళువెను అమ్మ నిన్న కండరె ప్రీతి' వంటి ఎన్నో పాటలకు వీరిద్దరూ గొంతు కలిపారు. సుశీల మాట్లాడుతూ "జానకి లేకుండా సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యం. జానకమ్మ లాంటి గొప్ప గాయని గొంతు వినే భాగ్యం ఈ తరానికి దక్కింది. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా, ఆమె పాడిన వేలాది అమర గీతాలు అలాగే ఉంటాయి. ఈ ప్రపంచం ఉన్నంత వరకు జానకికి మరణం లేదు" అని తన సహ గాయని ఎస్. జానకి గురించి పి. సుశీల మనసువిప్పి మాట్లాడారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image2
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved