MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?

Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?

Janaki Vs Savitri : ఎంత సౌమ్యులైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న వివాదాలైనా లేకుండా కెరీర్ ఉండదు. జానకి సినీ జీవితంలో కూడా కొన్ని వివాదాలు నడిచాయి. మహానటి సావిత్రితో జానకి వివాదం గురించి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 12 2026, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇద్దరు అద్భుతాలే..
Image Credit : Asianet News

ఇద్దరు అద్భుతాలే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి, గానకోకిల ఎస్. జానకి ఇద్దరూ తమ తమ రంగాలలో శిఖర సమానులు. ఒకరు నటనతో వెండితెరను ఏలితే, మరొకరు తన మధురమైన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అయితే, వీరిద్దరి కెరీర్ ప్రారంభంలో ఒక ఆసక్తికరమైన వివాదం నడిచింది. సావిత్రి నటించే సినిమాలకు పాడనని ఎస్. జానకి ఒకానొక సమయంలో పట్టుబట్టారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఆ అసలు కథ ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సావిత్రికి పాటలు ఆఇద్దరే పాడేవారు?
Image Credit : facebook

సావిత్రికి పాటలు ఆఇద్దరే పాడేవారు?

ఆ రోజుల్లో సావిత్రి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆమె నటించే సినిమాలకు ఎక్కువగా పి. లీల, పి. సుశీల పాటలు పాడేవారు. ముఖ్యంగా తన హావభావాలకు, నటనకు సుశీలమ్మ గొంతు మాత్రమే సరిగ్గా సరిపోతుందని సావిత్రి గట్టిగా నమ్మేవారు. సావిత్రి సినిమాలకు సుశీల మాత్రమే పాడాలనే ఒక నియమం కూడా ఉండేది. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ, తన కెరీర్ ప్రారంభంలో ఒక తమిళ సినిమాలో సావిత్రి పాత్ర కోసం ఒక అద్భుతమైన పాటను ఆలపించారు.

Related Articles

Related image1
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Related image2
Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
35
జానకి పాటను పక్కన పెట్టిన సావిత్రి..
Image Credit : Asianet News

జానకి పాటను పక్కన పెట్టిన సావిత్రి..

రికార్డింగ్ పూర్తయ్యాక ఆ పాట చాలా బాగా వచ్చింది. కానీ, సావిత్రి మాత్రం తన నటనకు జానకి వాయిస్ కంటే సుశీల వాయిస్ అయితేనే బాగుంటుందని భావించారు. దాంతో జానకమ్మ పాడిన ఆ పాటను పక్కన పెట్టి, మళ్లీ పి. సుశీల చేత రీ-రికార్డింగ్ చేయించారు. ఈ విషయం ఎస్. జానకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తాను ఎంతో కష్టపడి పాడిన పాటను కేవలం వాయిస్ సూట్ అవ్వలేదు అనే కారణంతో మార్చేయడం జానకమ్మకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

45
సావిత్రికి పాటలు పాడను అని జానకి శపథం..
Image Credit : Asianet News

సావిత్రికి పాటలు పాడను అని జానకి శపథం..

ఈ అవమానాన్ని భరించలేని జానకి.. "ఇకపై సావిత్రి నటించే సినిమాలకు నేను ఎప్పటికీ పాటలు పాడను" అని ఒక శపథం చేశారు. అన్నట్టుగానే ఒకానొక సందర్భంలో సావిత్రి నటిస్తున్న ఒక చిత్రంలోని ‘నీలిల పాడేద దేవ’ అనే పాటను పాడటానికి జానకమ్మ నిరాకరించారు. ఆ పాట రికార్డింగ్‌ను దాదాపు మూడు నెలల పాటు పెండింగ్‌లో పెట్టారు. ఆతరువాత తప్పక ఆ పాటను ఆమె పాడక తప్పలేదు.

55
ఓ ఇంటర్వ్యూలో జానకి మాట్లాడుతూ..
Image Credit : facebook/@sjanaki

ఓ ఇంటర్వ్యూలో జానకి మాట్లాడుతూ..

''సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం కాబోలు. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేవారు కాదు. నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను అనిచెప్పేశాను. సావిత్రి అభినయించడంతో.. ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని నిర్మాతలు దర్శకులు చెప్పడంతో పాడటానికి ఒప్పుకున్నాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది''. అని జానకి అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
సావిత్రి (నటి)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Related Stories
Recommended image1
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Recommended image2
Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved