MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay vs Jason Sanjay: తండ్రి విజయ్‌ కోసం కొడుకు త్యాగం.. `జననాయగన్‌`తో పోటీ నుంచి సిగ్మా డ్రాప్‌

Vijay vs Jason Sanjay: తండ్రి విజయ్‌ కోసం కొడుకు త్యాగం.. `జననాయగన్‌`తో పోటీ నుంచి సిగ్మా డ్రాప్‌

Vijay vs Jason Sanjay: విజయ్ కొడుకు జాసన్‌ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'సిగ్మా' సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉంది. తండ్రి సినిమా 'జననాయగన్' వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టాక్.

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 14 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జననాయగన్‌ కోసం సిగ్మా వాయిదా?
Image Credit : Instagram

జననాయగన్‌ కోసం సిగ్మా వాయిదా?

తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు 'జననాయగన్', 'సిగ్మా' సినిమాల రిలీజ్ డేట్ల గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జననాయగన్' రిలీజ్ అవుతుండగా, ఆయన కొడుకు జాసన్‌ సంజయ్ తొలిసారి దర్శకత్వం వహించిన 'సిగ్మా' వాయిదా పడటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లకముందే, 'జననాయగన్' తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జననాయగన్‌ని సెలబ్రేట్‌ చేయబోతున్న విజయ్‌ అభిమానులు
Image Credit : X

జననాయగన్‌ని సెలబ్రేట్‌ చేయబోతున్న విజయ్‌ అభిమానులు

సెన్సార్ సమస్యలతో పాటు పలు కారణాల వల్ల 'జననాయగన్' విడుదల చాలా ఆలస్యమైంది. ఈలోగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ సినిమా కేవలం ఒక రిలీజ్‌లా కాకుండా, విజయ్ సినీ ప్రస్థానానికి ముగింపుగా నిలవనుంది. అందుకే జూలై 24న రాబోతున్న ఈ సినిమాను అభిమానులు ఓ పండగలా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు.

Related Articles

Related image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Related image2
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్‌.. అఖిల్‌ `లెనిన్‌` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
34
జాసన్‌ సంజయ్‌ డెబ్యూ ఫిల్మ్ సిగ్మా
Image Credit : Instagram

జాసన్‌ సంజయ్‌ డెబ్యూ ఫిల్మ్ సిగ్మా

విజయ్ కొడుకు జాసన్‌ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'సిగ్మా' సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, జాసన్‌ తొలి చిత్రం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట ఈ సినిమాను జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అంటే 'జననాయగన్' రిలీజైన వారం తర్వాత థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

44
తండ్రితో పోటీ సరికాదని జాసన్‌ నిర్ణయం
Image Credit : X

తండ్రితో పోటీ సరికాదని జాసన్‌ నిర్ణయం

కొత్త దర్శకుడిగా జాసన్‌ సంజయ్‌కు 'సిగ్మా' చాలా కీలకమైన సినిమా. అందుకే పెద్ద సినిమాలతో పోటీ పడకుండా, సోలో రిలీజ్ డేట్ దొరికితే సినిమా వసూళ్లకు కూడా మంచిదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఇప్పుడు రిలీజ్ చేస్తే 'సిగ్మా'కు సరిపడా థియేటర్లు దొరకవనేది కూడా ఈ నిర్ణయానికి మరో ముఖ్య కారణం. అందుకే 'సిగ్మా' సినిమా విడుదలను ఆగస్టుకు మార్చినట్లు సమాచారం. దీనివల్ల జూలై నెల మొత్తం థియేటర్లలో 'జననాయగన్' హవానే నడుస్తుందని అంచనా వేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image2
Posani: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీలో ఏం చూపించబోతున్నారో తెలుసా?.. పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌
Recommended image3
Celina Jaitly: మ్యారేజ్‌ లైఫ్ లో నరకం.. పిల్లలు, విడాకులు, హక్కులపై శౌర్యం నటి బోల్డ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image2
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్‌.. అఖిల్‌ `లెనిన్‌` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved