Brahmastra First Review: బ్రహ్మస్త్రం ఫస్ట్ రివ్యూ... సినిమా హిట్టా? ఫట్టా?
రన్బీర్ కపూర్-అలియా భట్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ విజువల్ వండర్ బ్రహ్మస్త్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుండగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ సభ్యుడు ఒకరు మూవీ ఎలా ఉందో తన అభిప్రాయం తెలియజేశాడు.

Brahmastra Review
రన్బీర్ కపూర్-అలియా భట్ ల భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మస్త్రం పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. అందుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ ఇందుకు నిదర్శనం. ప్రేక్షకులు చిత్రం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు అర్థం అవుతుంది. మొత్తం బాలీవుడ్ ఈ చిత్ర ఫలితం కోసం ఎదురుచూస్తుంది. అక్కడ కఠిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బ్రహ్మాస్తం బాలీవుడ్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Brahmastra Review
దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో బ్రహ్మాస్త్రం తెరకెక్కింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్రం విడుదల కానుంది. కింగ్ నాగార్జున, షారుక్ ఖాన్, అమితాబ్, మౌని రాయ్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.
Brahmastra Review
దర్శకుడు రాజమౌళి సౌత్ లో బ్రహ్మస్త్రం సినిమాను సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గెస్ట్ గా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాల కారణంగా పోలీస్ సిబ్బందిని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడంతో ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే అదే రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బ్రహ్మాస్త్రం చిత్ర యూనిట్ తో పాటు ఎన్టీఆర్, నాగార్జున, రాజమౌళి పాల్గొన్నారు. రాజమౌళి బ్రహాస్త్రం చిత్రాన్ని ఇంతలా ప్రమోట్ చేయడానికి కారణం.. ఆయన తెలుగు రాష్ట్రల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్న వాదన ఉంది.
Brahmastra Review
అసలు బ్రహ్మాస్త్రం ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఆయన రివ్యూ చిత్ర యూనిట్ ని భయపెట్టేదిగా ఉంది. బ్రహ్మాస్త్రం చిత్రానికి ఉమర్ సంధు యావరేజ్ రేటింగ్ ఇచ్చాడు. సినిమాపై హైప్ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టినప్పటికీ లాంగ్ రన్ లో నిలబడే సూచనలు లేవన్నాడు.
Brahmastra Review
ఉమర్ సంధు తన రివ్యూలో విజువల్స్, సినిమాటోగ్రఫీ అద్భుతం అన్నాడు. ప్రొడక్షన్ డిజైన్ అమేజింగ్ అంటూ కొనియాడారు. అయితే కొన్ని సన్నివేశాల్లో లైటింగ్ డార్క్ గా ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయి. కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ బోరింగ్ గా సాగింది అన్నారు. సంగీతానికి 2.5 రేటింగ్ ఇచ్చాడు. రన్బీర్ నటన అద్భుతం, అలియా చాలా క్యూట్ గా ఉన్నారు. మౌని రాయ్ ఇంకా నాగిన్ పాత్ర నుండి బయటపడ్డట్లు లేదు. అమితాబ్ బచ్చన్ మనసులు దోచుకున్నారు.
Brahmastra Review
షారుక్ ఖాన్ ఈ చిత్రంలో కనిపించడం గొప్ప విషయం. మొత్తంగా బ్రహ్మాస్త్రం మూవీలో ఆత్మ మిస్ అయ్యింది. ఈ భారీ బడ్జెట్ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబడుతుందని చెప్పలేమని బాంబు పేల్చాడు. సాధారణంగా ఉమర్ సంధు చెత్త సినిమాలకు కూడా బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇస్తాడు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఆయన ఇచ్చే ఎలివేషన్, రేటింగ్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ క్రమంలో బ్రహ్మాస్త్రం చిత్రానికి ఉమర్ ఇంత దారుణమైన రేటింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.