ఈ వారం ఓటీటీలో నితిన్, తమన్నా, అజిత్ సందడి.. ఆ మూడు చిత్రాలు తప్పక చూడాల్సిందే
నితిన్, తమన్నా, అజిత్ నటించిన చిత్రాలతో పాటు మరికొన్ని ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ వారం ఓటీటీ సినిమాలు
ఓటీటీలో కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఉంది.నితిన్, తమన్నా, అజిత్ నటించిన చిత్రాలతో పాటు మరికొన్ని ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ
అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దర్శకత్వం ఆదిక్ రవిచంద్రన్. ఓ కేసులో చిక్కుకున్న తన కొడుకుని హీరో ఎలా రక్షించాడు అనేది ఈ చిత్ర కథ.
అస్త్రం
శ్యామ్ నటించిన అస్త్రం మే 9న ఆహా ఓటీటీలో విడుదలవుతోంది. దర్శకత్వం అరవింద్ రాజగోపాల్.పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది.
టెన్ అవర్స్
శిబిరాజ్ నటించిన టెన్ అవర్స్ మే 9న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. దర్శకత్వం ఇళయరాజా కలియప్పెరుమాళ్.
ఇతర భాషా చిత్రాలు
సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో, అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా నటించిన చిత్రం ఓదెల 2. గ్లామర్ ని పక్కన పెట్టి నాగ సాధువుగా తమన్నా నటించిన చిత్రం ఇది. మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలయింది.
Nithiin, Sreeleela Robinhood movie
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండవ చిత్రం గా రాబిన్ హుడ్ తెరకెక్కింది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. మే 10 నుంచి ఈ చిత్రం జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
jack movie review
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన జాక్ చిత్రం మే 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.