MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Releases: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ ల పండగ... థియేటర్లకు షాక్

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ ల పండగ... థియేటర్లకు షాక్

థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి ఓటీటీలు. డిజిటల్ రిలీజ్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా వరకూ  థియేటర్లు మూత పడడంతో ఎక్కువగా సినిమాలన్నీ ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ప్రతీవారం థియేటర్ రిలీజ్ లకంటే ఓటీటీ రిలీజ్ ల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మరి ఈవారం ఓటీటీల్లో మెరిసే సినిమాల సంగతి చూస్తే..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2022, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కరోనా టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటికే థియేటర్లు ఓపెన్ అయినా.. ఓటీటీలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నా.. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీల బాట పడుతున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాటపడుతున్నాయి. ఈవారం టాలీవుడ్,బాలీవుడ్ సినిమాలతో ఓటీటీలో పండగ జరగబోతోంది.

28

కోలీవుడ్ స్టార్ తండ్రీ.. కొడుకులు చియాన్ విక్రమ్, ధ్రువ్ విక్రమ్ లు కలిసి నటించిన సినిమా మహాన్. యంగ్ స్టార్  కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా కారణంగా ఎప్పటికప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు.   

38

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్ల అశోక్ హీరోగా పరిచయమైన మూవీ హీరో. నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి బాగుంది అనిపించింది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయబోతున్నారు.


 

48

తెలుగులో రీ ఎంట్రీ తరువాత దూసుకుపోతోంది సీనియర్ హీరోయిన్ ప్రియమణి. ఈమె హీరోయిన్ గా అభిమన్యు తెరకెక్కించిన లేడీ ఓరియోంటెడ్ మూవీ భామా కలాపం. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్  కానుంది.

58

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్, వర్షిణీ సౌందర రాజన్, నైనా గంగూలీలు హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా మళ్లీ మొదలైంది. ఈ సినిమా చాలా కాలంగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ మూవీని ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. 

68

బాలీవుడ్ లో ఇప్పటికే చర్చనీయాంశం అయిన సినిమా గ్రెహ్రాయియా. కేవలం ఓటీటీ కోసమే తీసిన ఈ సినిమాను ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీస్  దీపికా పదుకోనే, అనన్యా పాండే తో పాటు యంగ్ స్టార్  సిద్ధాంత్ చతుర్వేది, ధైర్యా కర్వాలు కీలకపాత్రలు చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రచ్చ రచ్చ చేస్తొంది.

 

78

ఇక ఈవారం ఓటీటీల్లోకి వెబ్ సిరీస్ లు కూడా వెల్లువలా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.  ఈనెల 9న మలయాళ సినిమా ఫ్రీడమ్ ఫైట్సోనీ లివ్ లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా..  హిందీ సినిమా రక్తాంచల్ ఫిబ్రవరి 11 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ లోరిలీజ్ కాబోతోంది. క్యాచింగ్ కిల్లర్స్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఫిబ్రవరి 9 నుంచి, ఇన్వెంటింగ్ అన్నా వెబ్ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి, లవ్ అండ్ లీషెస్ – కొరియా సినిమా ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.

88

అటు హాలీవుడ్ నుంచి కూడా ఫిబ్రవరి 11 న ద ప్రివిలేజ్ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుండగా.. ఐ వాంట్ యూ బ్యాక్  హాలీవుడ్ మూవీ ప్రైమ్ లో ఫిబ్రవరి 11 నుంచి, కొరియా సిరీస్ స్నో డ్రాప్ డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 9  నుంచి..  ఐ వాంట్ యూ బ్యాక్ –హాలీవుడ్ మూవీ ప్రైమ్ లో ఫిబ్రవరి 11 నుంచి, టాల్ గర్ల్ – హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 11 నుంచి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved