- Home
- Entertainment
- Urvasivo Rakshasivo Review: ఊర్వశివో రాక్షసివో ప్రీమియర్ అండ్ ట్విట్టర్ టాక్... ఈసారి శిరీష్ గట్టిగా కొట్టాడు
Urvasivo Rakshasivo Review: ఊర్వశివో రాక్షసివో ప్రీమియర్ అండ్ ట్విట్టర్ టాక్... ఈసారి శిరీష్ గట్టిగా కొట్టాడు
అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ కాంబినేషన్లో దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో. నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదల అయ్యింది. ప్రీమియర్స్ ప్రదర్శన ఇప్పటికే ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం..

Urvasio Rakshasivo movie review
ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం అల్లు శిరీష్ చాలా కాలంగా ప్రదక్షిణలు చేస్తున్నారు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతుండగా ఫేమ్ తెచ్చే ఒక్క మూవీ పడలేదు. మరోవైపు అను ఇమ్మానియేల్ పరిస్థితి కూడా అదే. ఆమె గత రెండు చిత్రాలు అల్లుడు అదుర్స్, మహాసముద్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అను కెరీర్ ప్రమాదంలోపడగా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
Urvasio Rakshasivo movie review
ఈ క్రమంలో అల్లు శిరీష్, అను ఇమ్మానియేల్ ఊర్వశివో రాక్షసివో మూవీపై ఆకాశమంత ఆశలు పెట్టుకున్నారు. వారి కోరిక ఈ సినిమాతో నెరవేరినట్లే కనిపిస్తుంది. ఊర్వశివో ఊర్వశివో ప్రీమియర్స్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. క్రిటిక్స్ మూవీ పట్ల అనుకూలంగా స్పందిస్తున్నారు. కొత్త కథ కాకున్నా ఆసక్తికర సన్నివేశాలు, కామెడీ, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అలరించాయి అంటున్నారు.
Urvasio Rakshasivo movie review
ఊర్వశివో రాక్షసివో.. కథను పరిశీలిస్తే శ్రీకుమార్(అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలని పేరెంట్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే శ్రీకుమార్ తన ఆఫీస్ లో పని చేసే సింధు(అను ఇమ్మానియేల్) ని ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం నానా పాట్లు పడుతూ ఉంటాడు. మరి శ్రీకుమార్ సింధు ప్రేమను గెలుచుకున్నాడా? సింధు, శ్రీకుమార్ లవ్ కహానీ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ
Urvasio Rakshasivo movie review
ఓ సింపుల్ రొటీన్ లవ్ స్టోరీని దర్శకుడు రాకేష్ శశి ఆసక్తికరంగా మలిచాడు అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. ముఖ్యంగా అను ఇమ్మానియేల్, శిరీష్ మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన శిరీష్ టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీని తలపించాడనేది కొందరి అభిప్రాయం. అంతలా ఇంటిమసీ సన్నివేశాల్లో మమేకమై నటించారట.
Urvasio Rakshasivo movie review
వీరిద్దరి మధ్య దర్శకుడు తెరకెక్కించిన సన్నివేశాలు అలరిస్తాయి అంటున్నారు. సింధు, శ్రీకుమార్ ల లవ్ స్టోరీని దర్శకుడు బోర్ కొట్టకుండా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. మోడరన్ లవ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై మెప్పించేలా ఆవిష్కరించారు అంటున్నారు.
Urvasio Rakshasivo movie review
ఊర్వశివో రాక్షసీవో చిత్రం ఎంటర్టైనింగ్ గా సాగడంలో కామెడీ కీలకంగా మారింది. ఆఫీస్ సన్నివేశాల్లో వెన్నెల కిషోర్ టైమింగ్ పంచ్లతో అల్లాడించేశాడు. హాస్య సన్నివేశాలు బాగా పేలాయని నెటిజెన్స్ అభిప్రాయం. ఫస్ట్ హాఫ్ మొత్తం దర్శకుడు రొమాంటిక్, కామెడీ సన్నివేశాల సమాహారంగా నడిపించాడు. అవి వర్క్ అవుట్ కావడంతో ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు.
Urvasio Rakshasivo movie review
ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకోగా సెకండ్ హాఫ్ కామెడీ సన్నివేశాలతో స్టార్ట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు అలరిస్తాయి. మ్యూజిక్ డీసెంట్ అంటున్నారు. పాటల చిత్రీకరణ, అను, శిరీష్ ప్రెజెన్స్ మెప్పిస్తుంది. అయితే కొత్తదనం లేని రొటీన్ స్టోరీ దర్శకుడు కామెడీ, రొమాన్స్ పైనే ఆధారపడి సినిమా నడిపించేశాడు అనేది ప్రధాన కంప్లైంట్. లోతైన ఎమోషన్స్ మేళవించి మంచి ముగింపు ఇచ్చి ఉంటే సినిమా ఇంకా మంచి ఫలితం అందుకునేది అంటున్నారు.
Urvasio Rakshasivo movie review
ప్రొడక్షన్ వాల్యూస్, క్యాస్టింగ్ కి మంచి మార్కులు వేస్తున్నారు. అల్లు శిరీష్ కి ఊర్వశివో రాక్షసివో మూవీ రూపంలో హిట్ దక్కడం ఖాయమంటున్నారు . పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ రొమాంటిల్ లవ్ ఎంటర్టైనర్ కమర్షియల్ గా ఎలాంటి ఫలితం అందుకుంటుంది అనేది చూడాలి.నవంబర్ 4న తొమ్మిది చిత్రాలకు పైగా విడుదల అవుతున్నాయి. మరో యువ హీరో సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుంది. దీంతో ఊర్వశివో రాక్షసివో చిత్రానికి చెప్పుకోదగ్గ పోటీ లేదు. మరి ఈ అవకాశాన్ని శిరీష్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.