Ori Devuda Review: విశ్వక్ సేన్ `ఓరి దేవుడా` మూవీ రివ్యూ
`అశోక వనంలో అర్జున కళ్యాణం` చిత్రంతో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు `ఓరి దేవుడా` అనే మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంతో వస్తున్నాడు. నాలుగు సినిమాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది `రివ్యూ`లో తెలుసుకుందాం.
విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ హిట్లు అందుకుంటూ వస్తోన్న యంగ్ సెన్సేషన్. `ఫలక్‌నుమా దాస్`, `హిట్`తో సక్సెస్ కొట్టిన ఆయన తర్వాత తడబడ్డారు. వరుసగా మూడు పరాజయాలు చవిచూశాడు. మళ్లీ `అశోక వనంలో అర్జునకళ్యాణం` చిత్రంతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ సినిమా వివాదంతో సంచలనంగా మారిపోయాడు. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. కానీ బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్‌తో మెప్పించాడు. ఇప్పుడు మరో సక్సెస్ కొట్టేందుకు `ఓరి దేవుడా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. పలు వాయిదాల అనంతరం `ఓరి దేవుడా` చిత్రం నేడు శుక్రవారం(అక్టోబర్ 21)న విడుదలైంది. ఇది తమిళంలో సక్సెస్ అందుకున్న `ఓ మై కాదవులే` చిత్రానికిది రీమేక్. మాతృక దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శుక్రవారం మూడు సినిమాల(ప్రిన్స్, సర్దార్, జిన్నా)తో పోటీ పడుతుంది. ఆడియెన్స్ ని ఆకట్టుకుందా, విశ్వక్ సేన్ ఈ సారి వివాదం లేకుండా క్లీన్‌గా చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ అందుకుందా అన్నది `ఓరి దేవుడా` రివ్యూలో తెలుసుకుందాం. Ori Devuda Review.
కథః
అర్జున్.. సరదాగా తిరిగే కుర్రాడు. తన ఫ్రెండ్స్ అను(మిథిలా పాల్కర్), వెంకటేష్(నటుడు)తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో మిథిలాకి వాళ్లింట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ అబ్బాయిని సెట్ కూడా చేస్తాడు వాళ్ల నాన్న(మురళీ శర్మ). ఆ అబ్బాయి అంటే అనుకి ఇష్టం లేదు. దీంతో చిన్నప్పట్నుంచి చూసి, పెరిగిన అర్జున్‌ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఓ వర్షం కురిసిన రాత్రి, ఆల్కహాల్ తీసుకున్న సమయంలో అను అడిగిన ప్రశ్నకి ఓకే చెబుతాడు. నో చెప్పడానికి రీజన్ లేదని ఆమెపై ప్రేమ లేకపోయినా పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లి తర్వాత అను వాళ్ల నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తుంటాడు. అనుని అర్జున్ ఫ్రెండ్‌గానే చూశాడు, లవర్‌గా, భార్యగా ఫీలవ్వలేకపోతాడు. దీంతో పెళ్లి తర్వాత ఆమెకి దగ్గర కాలేకపోతాడు. పైగా వాళ్ల కంపెనీలో టాయిలెట్ బేసిన్ల పనిచేయలేక, అనుతో ఉండలేక ఇబ్బంది పడుతుంటాడు. Ori Devuda Review.
ఇంతలో స్కూల్ సీనియర్ అమ్మాయి మీరా పరిచయం అవుతుంది. ఆమె మాటలు, ఆమె గైడెన్స్ అర్జున్‌కి బాగా నచ్చుతాయి. ఆమెకి దగ్గరవుతుంటాడు. ఇది చూసిన అను.. అర్జున్‌ని అనుమానిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. అవి తీవ్రం కావడంతో విడాకుల వరకు వెళ్తాయి. కోర్ట్ లో డైవర్స్ పై విచారణ జరిగే క్రమంలో అందులోనే పరిచయం అయిన రాహుల్ రామకృష్ణన్ జరిగేవన్నీ ముందే చెప్పడం, కోర్ట్ లో అదే జరగడం, దీంతో అర్జున్ కాస్త రాహుల్ రామకృష్ణ ద్వారా వెంకటేష్(లవ్ కోర్ట్) వద్దకు వెళ్లడం చకచకా జరిగిపోతాయి. మరి అక్కడ వెంకటేష్ విశ్వక్ సేన్ కథ అంతా విని లైఫ్‌లో మరో ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటి? అర్జున్ ఆ ఛాన్స్ ని వాడుకుని ఏం చేశాడు? ఇంతకి వెంకటేష్ ఎవరు? వీరి లైఫ్‌కి ఆయనకు సంబంధం ఏంటి? అర్జున్ అనుతో కంటిన్యూ అయ్యాడా, మీరాతో కమిట్ అయ్యాడా? అనేది మిగిలిన సినిమా కథ. Ori Devuda Review.
విశ్లేషణః
కొత్తగా పెళ్లైన జంటల్లో వచ్చే సమస్యలు, ప్రేమ లేకపోవడం వల్ల కొత్త జంటల్లో తలెత్తే ఇబ్బందులను ఆవిష్కరించిన చిత్రమిది. కథ కాస్త విన్నట్టుగానే ఉన్నా, దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంపైనే సినిమా సక్సెస్ ఫెయిల్ ఆధారపడి ఉంటుంది. ఇందులో ఓ జంటలోని సంఘర్షణని చాలా సున్నితంగా డీల్ చేశాడు దర్శకుడు. దాన్ని లైటర్ వేలో, వినోదాత్మకంగా చెప్పడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అదే సినిమాకి ప్లస్ అయ్యింది. తమిళంలో విడుదలైన `ఓ మై కాదవులే` అక్కడ పెద్ద హిట్ అయ్యింది. లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ వస్తే వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అనేది ఇందులో మెయిన్ అంశం. దాన్ని అంతే బాగా నీట్‌గా, క్లీన్ గా డీల్ చేశాడు దర్శకుడు. సెకండ్ ఛాన్స్ అనేది దేవుడైన వెంకటేష్ పాత్ర ద్వారా ఇప్పించిన తీరు ఆకట్టుకుంది. పైగా సినిమాని ఆద్యంతం ఫన్ ఎలిమెంట్లు, భార్యభర్తల మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న బేధాభిప్రాయాలను, ఈ క్రమంలో పుట్టే ఫన్ ఎలిమెంట్లు ఇందులో చూపించారు. Ori Devuda Review.
ఇష్టం లేని పని చేయడం వల్ల వచ్చే ఇబ్బందులను బాగా ఆవిష్కరించారు. అయితే మొదటి భాగంలో కాస్త లాగ్ అనిపించింది. అన్ని చోట్లు ఫన్ వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్ మాత్రం సినిమాకి బలం. ఫన్‌తోపాటు ఎమోషన్స్ జోడించాడు. టైట్ స్క్రీన్ ప్లేతో, కథ నుంచి ఆడియెన్స్ ని డైవర్ట్ కాకుండా బాగా తీసుకెళ్లారు. ఎమోషన్స్, ఫన్ మేళవింపుగా సాగే చిత్రం చివర్లో మరింత ఎమోషనల్ గా మారిపోయింది. మధ్య మధ్య విశ్వక్ సేన్ ఫ్రెండ్ వెంకటేష్ పాత్ర చేసే కామెడీ, అలాగే మీరాతో, అటు మిథిలాతో లవ్ సీన్లలో పుట్టే ఫీల్ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో కథ స్లో కావడం కాస్త బోర్ ఫీల్‌ని తెప్పించినా, క్లైమాక్స్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఇక విశ్వక్ ఫ్రెండ్ తో చెప్పే `చెప్పినా నీకు అర్థం కాదులే` డైలాగ్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. Ori Devuda Review.
ప్రేమలేకపోతే, భార్యభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ సరైన విధంగా లేకపోతే, అపర్థాలకు దారితీస్తుందని, అదే ప్రేమతో చూస్తే ఆ ప్రపంచం అందంగా, అద్భుతంగా కనిపిస్తుందని చెప్పే చిత్రమిది. చిన్న సందేశాన్ని చాలా సింపుల్‌గా, లైటర్ వేలో, ఓ సంఘర్షణ రూపంలో ఈ చిత్రంలో చెప్పిన విధానం బాగుంది. ఆహా.. ఓహో అనే డైలాగ్‌లు లేకపోయినా, ప్రతి డైలాగ్ మనకు కనెక్ట్ అవుతుంది. మన నిజ జీవితంలోని సన్నివేశాలను గుర్తు చేసేలా ఉంటుంది. సినిమా ప్రధానంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా నచ్చుతుంది. కొత్త జంటలకు, అరెంజ్ మ్యారేజ్ జంటలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. మాస్ ఎలిమెంట్ ఇందులో ఆశించలేం. దీంతో ఏ, బీ సెంటర్ ఆడియెన్స్ కి అవుతుంది. కానీ `సీ` సెంటర్ ఆడియెన్స్ కి రీచ్ కావడం కష్టం. Ori Devuda Review.
నటీనటులుః
విశ్వక్ సేన్ చాలా మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించారు. తన కెరీర్‌కిది పూర్తి భిన్నమైన చిత్రమని చెప్పొచ్చు. మొదటి సినిమాలతో రౌడీ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన `అశోకవనంలో అర్జున కళ్యాణం`తో తన ఇమేజ్ ని మార్చుకున్నాడు. పూర్తి ఫ్యామిలీ జోనరలో చేశాడు. ఈ చిత్రంతోనూ మరోసారి ఫ్యామిలీ జోనర్‌లో ప్రయత్నించి ఆకట్టుకున్నాడనే చెప్పాలి. కాకపోతే ఇది యంగ్ స్టర్స్ కి బాగా ఆకట్టుకుంటుంది. అర్జున్ పాత్రలో విశ్వక్ పరకాయ ప్రవేశం చేశాడు. ఇక అను పాత్రలో మిథిలా పాల్కర్ చాలా బాగా చేసింది. మీరా పాత్రలో ఆశా భట్ సైతం హుందాగా చేసి మెప్పించింది. ఫ్రెండ్‌గా చేసిన వెంకటేష్ మరో హైలైట్‌గా నిలిచాడు. దేవుడి పాత్రలో వెంకటేష్ తనదైన స్టయిల్లో చేసేశాడు. రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ వంటి మిగిలిన పాత్రలు ఉన్నంతలో మెప్పించాయి. Ori Devuda Review.
టెక్నీషియన్లుః
సినిమాకి దర్శకుడి టేకింగ్ హైలైట్. తెలుగుకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి నీట్‌గా డిజైన్ చేశాడు. స్క్రీన్‌ప్లేనే సినిమాకి హైలైట్. ఫన్ ఎలిమెంట్స్ లో ఎక్కడా ఓవర్ లేకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌ని తీసుకొచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో ప్లస్ అయ్యింది. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడింది. విధు అయ్యనా సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఇంకాస్త తన కత్తెరకి పని పెట్టాల్సింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవడంతోపాటు విశ్వక్ సేన్ ఇమేజ్‌ని మార్చే చిత్రమవుతుంది. వివాదాలు లేకుండా క్లీన్‌గా ప్రమోట్ చేసుకోవడం కూడా సినిమాకి కలిసొచ్చే అంశం. Ori Devuda Review.
ఫైనల్‌గా `ఓరి దేవుడా` ఎలాంటి అంచనాలు లేకుండా యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సరదాగా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా నిలుస్తుంది.
రేటింగ్‌ః 2.75.