MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ముగ్గురికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌ ఎవరో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ముగ్గురికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌ ఎవరో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ఈ ముగ్గురికి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరోయిన్‌ ఒక్కరే కావడం విశేషం. ఆ హీరోయిన్‌కి బిగ్గెస్ట్ హిట్స్ కూడా ఈ ముగ్గురు హీరోలతోనే వచ్చాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2025, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌లకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌
Image Credit : telugu stop

పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌లకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌

హీరోలకు ఒక హీరోయిన్‌ లక్కీ ఛామ్‌ ఉంటుంది. ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే హిట్టే అనే సెంటిమెంట్‌ ఉంటుంది. అయితే ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లకు ఒక్క లక్కీ హీరోయిన్‌ ఉంది. వీరికి విజయాలను అందించింది. అయితే అవి మామూలు విజయాలు కావు, ఇండస్ట్రీ హిట్స్. ఈ ముగ్గురికి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరోయిన్‌ ఒక్కరే కావడం విశేషం. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? ఆ సినిమాలేంటి? అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`ఖుషి`తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పవన్‌
Image Credit : our own

`ఖుషి`తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. అప్పట్లో పవన్‌ కి వచ్చిన హిట్స్ కి ఇండస్ట్రీ మొత్తం షేక్‌ అయ్యింది. దీంతో ఆయనకు విశేషమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. `సుస్వాగతం`, `తొలిప్రేమ`, `తమ్ముడు`, `ఖుషి` పవన్‌ లైఫ్‌నే మార్చేశాయి. స్టార్‌ హీరోని చేశాయి. ఇందులో `ఖుషి` ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. యువతని బాగా ప్రభావితం చేసిన మూవీగానూ నిలిచింది. 2001లో వచ్చిన ఈ చిత్రానికి ఎస్‌ జే సూర్య దర్శకుడు. ఇందులో పవన్‌కి జోడీగా భూమిక నటించింది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. పవన్‌ని తిరుగులేని స్టార్‌ని చేసింది. పవర్‌ స్టార్‌గా మార్చింది.

Related Articles

Related image1
ఆస్కార్‌ బరిలో దిగిన తెలుగు సినిమాలివే.. పుష్ప 2, కుబేర, కన్నప్ప, సంక్రాంతికి.. ఈ సారి రికార్డు స్థాయిలో
Related image2
చక్రితో కౌసల్య లవ్‌ ఎఫైర్‌, అందుకే ఆయన్ని వదల్లేదా?.. తెరవెనుక నిజాలు బయటపెట్టిన స్టార్‌ సింగర్
35
`ఒక్కడు`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న మహేష్‌
Image Credit : our own

`ఒక్కడు`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న మహేష్‌

మహేష్‌ బాబు సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో పెద్ద బ్రేక్‌ ఇచ్చిన మూవీ `ఒక్కడు`. `మురారి` తర్వాత ఆయనకు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. దీనికి గుణశేఖర్‌ దర్శకుడు. ఇందులో భూమిక హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. 2003లో విడుదలై మహేష్‌ బాబు కెరీర్‌లోనే అప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో టాలీవుడ్‌లో అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్‌లాంటి మూవీ అనిపించుకుంది. ఈ మూవీతో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు మహేష్‌. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

45
`సింహాద్రి`తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఎన్టీఆర్‌
Image Credit : prime videos

`సింహాద్రి`తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఎన్టీఆర్‌

అదే ఏడాది ఎన్టీఆర్‌ని స్టార్‌ హీరోని చేసిన మూవీ `సింహాద్రి`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  ఇక తారక్‌కి ఇండస్ట్రీలో తిరుగులేదని నిరూపించిన మూవీ ఇది.

55
ఖుషి, ఒక్కడు, సింహాద్రిలో భూమిక హీరోయిన్‌
Image Credit : Instagram

ఖుషి, ఒక్కడు, సింహాద్రిలో భూమిక హీరోయిన్‌

ఇలా పవన్‌ కళ్యాణ్‌ `ఖుషి`, మహేష్‌ బాబు `ఒక్కడు`, ఎన్టీఆర్‌ `సింహాద్రి`లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో హీరోయిన్‌ ఒక్కరే కావడం విశేషం. ఆమెనే భూమిక. `యువకుడు` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి `ఖుషి`తో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అప్పట్లో టాప్‌ 1 హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు రష్మిక లాగా, అప్పుడు భూమిక ఇండస్ట్రీని శాసించిందని చెప్పొచ్చు. `ఖుషి`, `ఒక్కడు`, `సింహాద్రి`, `మిస్సమ్మ`, `సాంబా`, `వాసు`, `నా ఆటోగ్రాఫ్‌`, `జై చిరంజీవా`, `మాయబజార్‌`, `సత్యభామ`, `అనసూయ`, `అమరావతి` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. మధ్యలో కొంత కాలం గ్యాప్‌ తీసుకుంది. నాని `ఎంసీఏ`తో మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యింది. చివరగా `సీతారామం` చిత్రంలో మెరిసింది భూమిక. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ఆస్కార్‌ బరిలో దిగిన తెలుగు సినిమాలివే.. పుష్ప 2, కుబేర, కన్నప్ప, సంక్రాంతికి.. ఈ సారి రికార్డు స్థాయిలో
Recommended image2
చక్రితో కౌసల్య లవ్‌ ఎఫైర్‌, అందుకే ఆయన్ని వదల్లేదా?.. తెరవెనుక నిజాలు బయటపెట్టిన స్టార్‌ సింగర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved