హీరోయిన్ల విషయంలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ ఇద్దరిలోనూ ఒక్కటే వీక్‌నెస్, రాఘవేంద్రరావు బయటపెట్టిన నిజం
హీరోయిన్ల విషయంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులో ఒకే క్వాలిటీ ఉందట. ఆ వీక్ నెస్ ఏంటో బయటపెట్టాడు రాఘవేంద్రరావు.
Krishna Birth Anniversary
సూపర్ స్టార్ కృష్ణ యాక్షన్‌లతో బాగా పేరుతెచ్చుకున్నారు. కానీ తన కెరీర్‌లో యాక్షన్ సినిమాలతోపాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, రొమాంటిక్ మూవీస్ కూడా చేశారు. కాకపోతే అవి చాలా తక్కువ. అడపాదడపా ఆయా మూవీస్‌లో మెరిశారు. ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సినిమాలతో మెప్పించారు. ఎన్నో ప్రయోగాత్మక మూవీస్ చేసి మెప్పించారు.
Mahesh Babu
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు మహేష్‌బాబు. ఇప్పుడు సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. మహేష్ కూడా ప్రారంభం నుంచి యాక్షన్ సినిమాలు చేశారు. అదే సమయంలో లవ్ స్టోరీస్, రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్స్ చేసి మెప్పించారు. కానీ ఏ సినిమాలో అయినా తన మార్క్ యాక్షన్ కామన్‌గా ఉండేది. యూత్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కోసం లవ్ ట్రాక్‌లు పెట్టేవారు. ఇప్పుడు భారీ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో అలరిస్తున్నారు మహేష్.
అయితే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులో ఓ కామన్ క్వాలిటీ ఉంది. అది హీరోయిన్ల విషయంలో. తమతో కలిసి నటించే హీరోయిన్ల విషయంలో ఇద్దరిలోనూ ఒకే వీక్‌నెస్ ఉందని తెలిపారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇద్దరూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో చాలా వీక్ అని చెప్పాడు రాఘవేంద్రరావు. కృష్ణతోనూ, మహేష్‌తోనూ ఆయన సినిమాలు చేశారు.
కృష్ణతో `వజ్రయుద్దం`, `అగ్నిపర్వతం`, `ఊరికిమొనగాడు`, `శక్తి`, ` భలే కృష్ణుడు`, `ఘరానా దొంగ`, `అడవి సింహాలు` వంటి చిత్రాలు చేశారు. ఇందులో `వజ్రాయుధం` పెద్దగా ఆడలేదు. మిగిలిన అన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మహేష్ ని హీరోగా పరిచయం చేస్తూ `రాజకుమారుడు` సినిమా చేశాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న కామన్ విషయాన్ని తెలిపాడు రాఘవేంద్రరావు. రొమాన్స్ విషయంలో ఇద్దరూ వీక్ అన్నారు. సెట్‌లో షూటింగ్ చేసేటప్పుడు హీరోయిన్లతో ఈ ఇద్దరు కాస్త ఇబ్బందిగా కనిపిస్తారని, హీరోయిన్‌ని ముట్టుకోవడానికి, గట్టిగా హగ్ చేసుకోవడానికి ఇష్టపడరని, ఆ విషయంలో ఎక్కువ టేకులు తీసుకుంటారని తెలిపారు రాఘవేంద్రరావు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒప్పుకున్నాడు. సౌందర్య లహరి టాక్ షోలో ఈ విషయాన్ని తెలిపారు రాఘవేంద్రరావు.
సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం మన మధ్య లేరు. ఆయన రెండేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక రాఘవేంద్రరావు సినిమాలు మానేశారు. తన సారథ్యంలో మూవీస్ నిర్మిస్తున్నారు. సీరియల్స్ చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయని మహేష్ కి పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉంది. రాజమౌళి మూవీని ఇంటర్నేషనల్‌స్టాండర్డ్స్ లో భారీ గ్లోబల్ ఫిల్మ్ గా తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతుందట.
also read: కీర్తిసురేష్ తల్లితో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? విలన్‌గా చేసినా సూపర్ హిట్