- Home
- Entertainment
- సిగరెట్లు, గంజాయి తాగేవాడిని జేబులో డబ్బులు కొట్టేశా...గత జీవితంపై తనికెళ్ళ భరణి కామెంట్స్!
సిగరెట్లు, గంజాయి తాగేవాడిని జేబులో డబ్బులు కొట్టేశా...గత జీవితంపై తనికెళ్ళ భరణి కామెంట్స్!
నటుడు తనికెళ్ళ భరణి గతాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తనకు కొన్ని వ్యసనాలు ఉండేవని చెప్పి బాధపడ్డారు.

Tanikella Bharani
తనికెళ్ళ భరణి బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక రచనలు చేసిన తనికెళ్ళ భరణి నటుడిగా అందరికీ సుపరిచితం. 1985లో వచ్చిన లేడీస్ టైలర్ మూవీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ ఆయనకు బ్రేక్ ఇచ్చింది. సుదీర్ఘ కెరీర్లో కరుడుగట్టిన విలన్ రోల్స్ తో పాటు కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేశారు. తనికెళ్ళ భరణి నటనలో తనకంటూ ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు.
సాధారణంగా అందరికీ తల్లి సెంటిమెంట్ ఉంటుంది. తనికెళ్ళ భరణికి మాత్రం నాన్న ఓ ఎమోషన్. పలు సందర్భాల్లో నాన్న గొప్పతనం గురించి వివరించాడు. నాన్నపై ఆయన రాసిన ఓ లఘు కవిత బాగా ఫేమస్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనికెళ్ళ భరణి నాన్నతో చిన్నప్పటి అనుభవాలు గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
thanikella bharani
''ఏడో తరగతి చదివే వరకు నాకు చెప్పులు లేవు. ఒకరోజు కావాలనే కాల్చి పడేసిన సిగరెట్ మీద కాలేసి అరిచాను. అలా చేస్తే మా నాన్న షాప్ కి తీసుకెళ్లి చెప్పులు కొనిస్తాడని అనుకున్నాను. కానీ మానాన్న చూసుకుని నడలేవా అని తిట్టారు. నేను చేసిన కొన్ని పనులు నచ్చక చెట్టుకు కట్టేసి కొట్టాడు.
Tanikella Bharani
నాన్న జేబులో నుండి ఒకటి రెండు రూపాయలు తరచుగా కొట్టేస్తూ ఉండేవాడిని. ఒకరోజు వంద రూపాయలు తీసుకున్నాను. సాయంత్రం మానాన్న... వాడికి పప్పు, నెయ్యి వేసి అన్నం పెట్టు. ఎందుకంటే మనింట్లో ఇదే చివరి భోజనం. రేపటి నుండి జైల్లో తినాల్సిందే అని అన్నాడు. వంద రూపాయలు కాజేసినందుకు బాగా తిట్టాడు. నేను పెద్దయ్యాక ఒక వెయ్యి రూపాయలు మానాన్న జేబులో పెడితే.. ఎందుకురా అనేవాడు. చిన్నప్పుడు తీసుకున్నదానికి వడ్డీ అని చెప్పేవాడిని.
Tanikella Bharani
అప్పట్లో నాకు సిగరెట్ అలవాటు ఉండేది.ఆ అలవాటు మానేసిన మా నాన్న ఓ రోజు నా జేబులో నుండి సిగరెట్ తీసుకుని కాల్చారు. ఒక దశలో సిగరెట్, గంజాయితో పాటు పలు వ్యసనాలకు బానిసయ్యాను. నాన్న చాలా బాధపడ్డారు. అవి వదులుకోవాలని కొట్టారు. మళ్ళీ మనసులో ఆయనే బాధపడ్డారు...'' అని చెబుతూ తనికెళ్ళ భరణి కన్నీరు పెట్టుకున్నారు.