ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న త్రిష.. వరుడు ఎవరంటే ?
తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
40 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పొన్నియన్ సెల్వం తమిళంలో మంచి విజయం దక్కించుకుంది. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే త్రిష నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదే అనే సందేహం అభిమానుల్లో ఉంది. ఎట్టకేలకు త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. త్వరలోనే త్రిష ఈ శుభ వార్తని అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
పాపులర్ అయిన ఓ మలయాళీ ప్రొడ్యూసర్ ని త్రిష వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనకి కాబోయే భర్త వివరాలని ప్రస్తుతానికి త్రిష గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.మలయాళీ నిర్మాతని వివాహం చేసుకోబోతున్న సంగతిని మాత్రం లీక్ చేసిందట.
త్రిష ఫోర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడని త్రిష భావిస్తోందట. దీనితో తనకి పరిచయం ఉన్న.. తనంటే ఇష్టపడే ఓ మలయాళీ నిర్మాతకు ఓకె చెప్పిందట. అయితే పెళ్లి విషయంలో త్రిష గతంలో చేదు అనుభవాలని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2015లో వరుణ్ మణియన్ అనే చెన్నై బిజినెస్ మ్యాన్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది.
నిశితార్థం తర్వాత వీరిద్దరి పెళ్లి వరకు వెళ్లకుండానే విభేదాలతో విడిపోయారు. త్రిష నిశ్చితార్థం రద్దు కావడంలో హీరో ధనుష్ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇక త్రిష లవ్ ఎఫైర్స్ విషయానికి వస్తే.. రానా దగ్గుబాటితో ఆమె గతంలో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.