- Home
- Entertainment
- ఆయన మోసం చేస్తే... మోహన్ బాబు సార్ గెలిపించారు సారంగదరియా సింగర్ కోమలి సంచలన కామెంట్స్!
ఆయన మోసం చేస్తే... మోహన్ బాబు సార్ గెలిపించారు సారంగదరియా సింగర్ కోమలి సంచలన కామెంట్స్!
వివాదరహితుడిగా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ను సారంగదరియా సాంగ్ వివాదం వెంటాడుతుంది. ఆ పాట నాదేనంటూ రచ్చకెక్కిన సింగర్ కోమలి వివాదానికి తెరదించేలా శేఖర్ కమ్ముల ఓ లేఖ విడుదల చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే మోసం చేశారంటూ కోమలి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
17

సారంగదరియా సాంగ్ సేకరించింది నేను దానిపై హక్కులు నావే అన్న కోమలి... ఆ పాట తనతో పాడించకుండా మంగ్లీతో పాడించడాన్ని తప్పుబట్టారు. మీడియా వేదికగా రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేశారు.

27
వివాదం పెద్దది అవుతున్న తరుణంలో స్వయంగా శేఖర్ కమ్ముల కలుగజేసుకొని వివరణ ఇచ్చారు. ఆమెకు డబ్బులతో పాటు, సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తామని చెప్పినట్లు దానికి కోమలి కూడా ఒప్పుకున్నారని చెప్పారు. దీనితో ఈ గొడవ ముగిసిందని అందరూ అనుకున్నారు.

37
అయితే కోమలి మనసులో ఆవేదన అలాగే ఉందని ఆమె తాజా కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోమలి పాల్గొన్నారు. ఆమె డబ్బుపై ఓ జానపద గీతం వేదికపై పాడారు.

47
దీనితో మోహన్ బాబు... కోమలిని వేదికపైకి పిలిచి సత్కరించడం జరిగింది. కళాకారులు అంటే నాకు ఎంతో ఇష్టం... వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు.

57
ఇదే వేదికపై మాట్లాడిన కోమలి.. మోహన్ బాబును పొగుడుతూనే... సుద్దాల అశోక్ తేజ, శేఖర్ కమ్ములను విమర్శించారు. మోహన్ బాబు సార్ నన్ను సన్మానించడం ద్వారా తన జన్మధన్యమైందని కోమలి అన్నారు. ఇది నా తొలిమెట్టు, ఇంతకు ముందు నేను ఓడిపోయాను... ఇప్పుడు గెలిచాను. మోహన్ బాబు సార్ నన్ను గెలిచేలా చేశారు అన్నారు.

67
ఈ మాటల ద్వారా కోమలి ఇంకా సారంగదరియా సాంగ్ విషయంలో చల్లబడలేదని అర్థం అవుతుంది. ఇప్పటికీ విమర్శలు చేస్తుందంటే.. ఆమెకు ఇంకా డబ్బులు అందలేదా? అందినా ఆమె అసహనతోనే ఉన్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.

77
మరో ప్రక్క సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతుంది. 14రోజుల్లో 50మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ గత టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసేసింది.

Latest Videos