- Home
- Entertainment
- మోహన్ బాబు చిన్న కోడలికి ఇంత టాలెంట్ ఉందా... సెన్సేషన్ గా భూమా మౌనిక ఇంస్టాగ్రామ్ పోస్ట్!
మోహన్ బాబు చిన్న కోడలికి ఇంత టాలెంట్ ఉందా... సెన్సేషన్ గా భూమా మౌనిక ఇంస్టాగ్రామ్ పోస్ట్!
మంచు మనోజ్ వైఫ్ మౌనికారెడ్డి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె యోగా భంగిమ చూసి, ఈమెకు ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

జూన్ 21 అంతర్జాతీయ యోగా డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు తమ యోగా స్కిల్స్ ప్రదర్శిస్తున్నారు. మంచు మనోజ్ వైఫ్ భూమా మౌనికారెడ్డి కఠిన ఆసనం వేశారు. ఆమె ఫోజ్ చూసిన నెటిజెన్స్ వావ్ అంటున్నారు. మీలో ఇంత టాలెంట్ ఉందా? యోగా మీద అంత పట్టు ఉందా? అని అడుగుతున్నారు.
Manchu Manoj
మౌనిక వేసిన ఆసనం మనం వేయాలంటే చాలా శిక్షణ తీసుకోవాలి. అలాగే చాలాకాలంగా యోగా అభ్యాసం చేస్తుండాలి. మౌనిక యోగా స్కిల్ చూస్తే ఆమెకు ఎప్పటి నుండో ప్రావీణ్యం ఉందనిపిస్తుంది. కాగా తల్లి శోభా నాగిరెడ్డి యోగా మీద అవగాహన కల్పించారట. ఈ సందర్భంగా ఆమె తల్లిని తలచుకున్నారు.
మనోజ్ మార్చి 3న భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. మనోజ్, మౌనికలకు తమ తమ భాగస్వాములతో విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న వీరి మధ్య అనుబంధం చిగురించింది. అది ప్రేమకు దారి తీసింది. మంచు మోహన్ బాబుకి భూమా ఫ్యామిలీతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే మౌనిక, మనోజ్ లకు పరిచయం ఉంది. మౌనిక వివాహానికి మనోజ్ హాజరు కావడం విశేషం.
మౌనికతో మనోజ్ వివాహం మోహన్ బాబుకు ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. మోహన్ బాబు, విష్ణు వేడుకలకు దూరంగా ఉన్నారు. మంచు లక్ష్మి ముందుండి మనోజ్ వివాహం చేసింది. ఈ క్రమంలో పుకార్లు నిజమే అన్న వాదన వినిపించింది. మనోజ్ పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరయ్యారు.
నూతన వధూవరులను సతీసమేతంగా ఆశీర్వదించారు. మంచు విష్ణు మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. మోహన్ బాబు జన్మదినం వేళ కోడలితో మోహన్ బాబు సంతోషంగా కనిపించారు. దీంతో మనస్పర్థలు పక్కన పెట్టి కలిసిపోయారనే మాట వినిపిస్తోంది.
ఇక మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతున్నారు. వాట్ ది ఫిష్ టైటిల్ తో మనోజ్ ఒక మూవీ ప్రకటించారు. అలాగే ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయన్నారు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుంది.