RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ఎన్టీఆర్ హీరోయిన్ సైలెంట్.. అలియాని అలా పోల్చుతూ దారుణంగా ట్రోలింగ్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్ననే ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్ననే ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ కి గాను సంగీత దర్శకుడు కీరవాణికి ఈ అవార్డు లభించింది.
దీనితో రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ సంతోషంతో ఎలా ఉప్పొంగిపోయారో చూశాం. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయ్యారు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. దేశం గర్వపడేలా చేశారు అంటూ ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన అలియా భట్, అజయ్ దేవగన్ కూడా సోషల్ మీడియాలో రాజమౌళిని, కీరవాణిని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించినప్పటికీ.. ఎన్టీఆర్ కి జోడిగా నటించిన ఫారెన్ పిల్ల ఒలీవియా మోరిస్ మాత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ఇలాంటి స్పందన తెలియజేయలేదు.
ఒలీవియా మోరిస్ నాటు నాటు సాంగ్ లో పెర్ఫామ్ కూడా చేసింది. అలియా భట్ కి ఈ సాంగ్ లో ఎలాంటి స్క్రీన్ స్పేస్ లభించలేదు. కానీ ఒలీవియా అందంగా మెరిసింది. డ్యాన్స్ కూడా చేసింది. ఆ సాంగ్ కి ఇంత పెద్ద గౌరవం దక్కినప్పుడు తన రియాక్షన్ తెలపకుండా సైలంట్ గా ఉండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉండగా అలియా భట్ పై నెటిజన్లు అనవసరంగా విరుచుకుపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడంతో నార్త్ లో కొన్ని మీడియా సంస్థలు.. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు అంటూ వేశారు. ఆ మీడియా సంస్థల పుణ్యమా అని అలియా ట్రోలింగ్ లో చిక్కుకుంది.
'ఆర్ఆర్ఆర్ చిత్రం అలియా భట్ ది అయితే.. రియలన్స్ కూడా అనిల్ అంబానీదే' అంటూ జోకులు పేల్చుతున్నారు. ఆర్ఆర్ఆర్ అలియా భట్ చిత్రం అయితే.. పీకే మూవీ రణబీర్ కపూర్ ది అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్ కంటే పులులకే స్క్రీన్ టైం ఎక్కువ అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.