- Home
- Entertainment
- `ఓజీ` సర్‌ప్రైజ్ వచ్చేది అప్పుడే.. పవన్ కళ్యాణ్ కోసం థమన్ స్పెషల్ ట్రీట్ ఏంటంటే?
`ఓజీ` సర్‌ప్రైజ్ వచ్చేది అప్పుడే.. పవన్ కళ్యాణ్ కోసం థమన్ స్పెషల్ ట్రీట్ ఏంటంటే?
OG movie: పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ త్వరలో విడుదల కాబోతుంది. వచ్చే నెలలో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌పై కొన్ని బ్యాలెన్స్ సీన్లు ఉన్నాయి. ఆయన షూటింగ్‌లో పాల్గొంటే సినిమా పూర్తవుతుంది. ఇటీవలే షూటింగ్‌కి ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా పవన్ కొడుకు మార్క్ శంకర్ ప్రమాదానికి గురి కావడంతో ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇక ఎప్పుడు పవన్ చిత్రీకరణలో పాల్గొంటాడు, ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
OG movie Update
OG movie: పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు`తోపాటు `ఓజీ` చిత్రంలో నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ముంబయి బేస్డ్ గా గ్యాంగ్ స్టర్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ మూవీ చిత్రీకరణ కూడా ఆల్మో చివరి దశలో ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చిత్రీకరణ పూర్తవుతుంది. రెండు వారాల పవన్ డేట్స్ అవసరం అవుతాయని తెలుస్తుంది. దీనికోసమే దాదాపు ఏడాదికిపైగా వెయిట్ చేస్తున్నారు.
OG movie
ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. అదిరిపోయింది. అదొక్కటే సినిమాపై హైప్ పెంచింది. ఇప్పటికీ ఆ హైప్‌ని హోల్డ్ లో పెట్టింది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో పవన్ ఏ మీటింగ్‌లో కలిసినా ఫ్యాన్స్ `ఓజీ ఓజీ` అంటూ అరుస్తున్నారు.
ఓజీ అప్ డేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. పవన్ ఫ్యాన్స్ ని అలర్ట్ చేశాడు. అప్ డేట్ ఎప్పుడు రాబోతుందో తెలిపారు.
OG movie
మ్యూజిక్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందట. `ఓజీ స్టోర్మ్` పేరుతో ఓ సాంగ్ రెడీ చేశాడట. పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ మూవీ షూటింగ్‌లో ఎప్పుడైతే పాల్గొంటాడో అదే రోజు ఈ పాటని విడుదల చేస్తారట. ఈ సాంగ్‌ని తమిళ స్టార్ శింబు ఆలపించడం విశేషం. పవర్ స్టార్ మూవీ పాటని కోలీవుడ్ స్టార్ హీరో పాడటం విశేషం.
అదే త్వరలో రాబోతుండటం మరో విశేషం. ఇది సినిమాపై హైప్‌ని పెంచుతుంది. మరి పవన్ ఎప్పుడు చిత్రీకరణలో పాల్గొంటాడో చూడాలి. దాని కోసం అభిమానులు, చిత్ర యూనిట్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ కోసమే అంతా వెయిట్ చేస్తుండటం విశేషం.
read more: తెలుగు ఆడియెన్స్ కి పూజా హెగ్డే గుడ్ న్యూస్.. రీఎంట్రీ ప్రకటన, టాలీవుడ్‌లో గ్యాప్‌కి కారణం ఏంటంటే?