MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిల్క్ స్మితని వాడుకొని వదిలేసిన స్టార్‌ డైరెక్టర్‌.. ఒంటరిని చేసి ఏకంగా సెట్‌లోనే వదిలేసి.. దారుణంగా అవమానం

సిల్క్ స్మితని వాడుకొని వదిలేసిన స్టార్‌ డైరెక్టర్‌.. ఒంటరిని చేసి ఏకంగా సెట్‌లోనే వదిలేసి.. దారుణంగా అవమానం

Silk Smitha: సిల్క్ స్మిత జీవితం ఒక విషాదాంతం. నిరుపేద స్థితి నుంచి, పూట గడవని పరిస్థితి నుంచి తనే సొంతంగా కష్టపడుతూ, చిన్నా చితకా పనులు చేసుకుంటూ, ఇంట్లో పనిమనిషిగానూ పనిచేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నటిగా ఎదిగింది. వ్యాంప్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఐటెమ్స్ సాంగ్స్ తో స్టార్‌గా ఎదిగింది. పాటలకే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గానూ నిలవడం విశేషం. స్టార్‌ హీరోయిన్ల సినిమా పారితోషికం కంటే సిల్క్ స్మిత ఒక పాట పారితోషికం ఎక్కువగా ఉండటం మరో విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 16 2025, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
silk smitha

silk smitha

Silk Smitha: సిల్క్ స్మిత తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంది. ఎన్నో అవమానాలను ఫేస్‌ చేసింది. చాలా ఇబ్బందులు పడింది. తనని ఛీదరించుకున్న రోజుల నుంచి తను లేకపోతే సినిమా లేదు అనే స్థాయికి ఎదిగింది. అంతగా హవా చూపించింది.

డబ్బుల కోసం కష్టాలు పడి ఆ తర్వాత అదే నోట్ల కట్టలపై పడుకున్న సందర్భాలున్నాయి. జీవితంలో లోతులు చూసింది, హైట్స్ చూసింది. కానీ కొన్ని పొరపాట్లు, మోసాలు ఆమె జీవితం విషాదం ముగిసేలా చేశాయి. 

24
silk smitha

silk smitha

ఇదిలా ఉంటే సిల్క్ స్మితని ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌ మోసం చేశారని అంటుంటారు. ఆయనే సిల్క్ స్మితకి అండగా ఉన్నాడట, చివరికి తనే మోసం చేశాడట. కానీ అంతకు ముందు ఓ డైరెక్టర్‌ ఆమెని బాగానే వాడుకున్నాడట. అంతేకాదు ఆమెకి లైఫ్‌ ఇచ్చాడట. ఆయనే బాలు మహేంద్ర. ఆయన దర్శకుడే కాదు సినిమాటోగ్రాఫర్‌ కూడా.

సిల్క్ స్మితని తన సినిమాల్లో బాగా చూపించేవారట. అలా ఆమె పాపులర్‌ అయ్యేలా చేశాడు. ఈ క్రమంలో సిల్క్ స్మితని అన్ని రకాలుగా బాగానే ఉపయోగించుకున్నారట. కానీ ఆ తర్వాత ఆమెని పట్టించుకోలేదు. అనంతరం ఈ ఆర్‌ఎంపీ డాక్టర్‌ వలలో చిక్కింది సిల్క్ స్మిత.

34
Silk Smitha

Silk Smitha

అయితే కెరీర్‌ బిగినింగ్‌లో ఓ సినిమా సెట్‌లో ఏకంగా ఆమెని ఒంటరి చేసి సెట్‌లోనే వదిలేసి వచ్చారట. అప్పట్లో స్టార్‌ డైరెక్టర్‌గా ఉన్న భారతీరాజా `సీతాకోక చిలుక` అనే సినిమాని రూపొందించారు. దీనికి ఏడిద నాగేశ్వరరావు నిర్మాత.

ఈ మూవీలో సిల్క్ స్మిత చిన్న రోల్‌ చేసింది. అప్పట్లో ఆమె కొత్త. మూడు నాలుగు సినిమాలు చేసింది కానీ ఇంకా గుర్తింపు రాలేదు. ఆమె అంటే టీమ్‌కి పెద్ద లెక్క లేదు. దీంతో ఓ రోజు ఔట్‌ డోర్‌లో షూటింగ్‌ జరిగితే, అంతా వచ్చారు, కానీ ఆమెని మాత్రం ఒంటరి చేసి ఆ సెట్‌లోనే వదిలేసి వచ్చారట. 

44

ఒక స్టార్‌ డైరెక్టర్‌ ఉన్న సినిమా సెట్‌లో ఒక లేడీ ఆర్టిస్ట్ కి ఇంతటి అవమానం జరగడం అత్యంత విచారకరం. ఈ విషయాన్ని ఒకప్పటి దర్శకుడు గీతా కృష్ణ వెల్లడించారు. ట్రెండ్‌ నౌటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

అప్పట్లో ఆమె అంటే గౌరవం ఉండేది కాదని, అంత దారుణంగా అవమానించారని తెలిపారు. అలాంటిది ఆమెనే ఆ తర్వాత స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ హీరోలు కూడా వెయిట్‌ చేసే స్థాయికి ఎదగడం విశేషం. 

read  more: AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ ఏంటో తెలుసా? త్వరలో రిలీజ్‌

also read: ఇక లైఫ్‌లో మల్టీస్టారర్‌ చేయను, ఆవేశంతో ఊగిపోయిన శోభన్‌ బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణతో చేసిన ఆ మూవీనే కారణం ?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved