- Home
- Entertainment
- `ఓజీ` ఓటీటీ డీల్.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రేట్.. ఫ్యాన్స్ కిది మామూలు కిక్కు కాదు?
`ఓజీ` ఓటీటీ డీల్.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ రేట్.. ఫ్యాన్స్ కిది మామూలు కిక్కు కాదు?
పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు సినిమాల పరంగానూ ఆయన దుమ్మురేపుతున్నాడు. తాజాగా `ఓజీ` ఓటీటీ డీల్ సెట్ అయ్యిందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజకీయంగా పదేళ్ల పోరాటం అనంతరం ఆయన సంచలన విజయాన్ని సాధించారు. దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. దేశ రాజకీయాలను మలుపుతిప్పే స్థాయికి వెళ్లారు పవన్. ప్రధాని మోడీ సైతం పవన్ కళ్యాణ్ కెపాసిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్ కాదు, సునామీ అంటూ అభినందించారు. దీంతో పవన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అది ఇప్పుడు సినిమాలకు కూడా పని చేస్తుంది.
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. `ఓజీ`, `హరిహర వీరమల్లు`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈమూడింటిని పక్కన పెట్టాడు పవన్. త్వరలోనే మళ్లీ సినిమాల షూటింగ్‌లో పాల్గనబోతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు హడావుడి పూర్తయ్యాక ఆయన `హరి హరవీరమల్లు` మూవీ షూటింగ్‌లో పాల్గనబోతున్నారు. ఇప్పటికే టీమ్‌కి సమాచారం అందించాడు పవన్. ఆ ఏర్పాట్లలో నిర్మాత ఉన్నారు.
ఇదిలా ఉంటే ముందుగా పవన్ `ఓజీ`ని త్వరగా పూర్తి చేస్తాడని భావించారు. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. `ఓజీ`ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల అనంతరం పవన్ `ఓజీ` షూటింగ్‌లోనే పాల్గొంటారని అన్నారు. కానీ సడెన్‌గా ఆయన `హరిహర వీరమల్లు`కి షిఫ్ట్ కావడం ఆశ్చర్యంగా మారింది. అయితే `ఓజీ`ని పక్కన పెట్టడానికి కారణం ఉందట. ఇంకా ఆ మూవీకి ఓటీటీ డీల్ కాలేదు. కొన్ని డీల్స్ సెట్ అయితేనే నిర్మాతలు సినిమా పూర్తి చేస్తారు. బడ్జెట్ వైజ్‌గా వెసులుబాటు ఉంటుంది. దాని కోసమే `ఓజీ`ని కొన్ని రోజులు ఆపాలనుకున్నారట.
కానీ ఎపీ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో, ఏపీ ప్రభుత్వంలో పవన్ కీలకంగా మారడంతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా మారిన నేపథ్యంలో పవన్ రేంజ్ పెరిగింది. క్రేజ్ డబుల్ అయ్యింది. ఈ క్రమంలో `ఓజీ` సినిమాకి ఊపు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధికంగా పలికినట్టు సమాచారం. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ సుమారు 95కోట్లకి డిజిటల్ రైట్స్ తీసుకుందట. దీంతో ఇది సినిమా త్వరగా కంప్లీట్ కావడానికి, నిర్మాతలకు పెట్టుబడికి సంబంధించిన కొంత రిలీఫ్ గా ఉండబోతుందట.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న `ఓజీ` సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో పవన్ ఇమేజ్, రోల్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందట. ముంబయి మాఫియా డాన్ ఓజాస్ పాత్రలో నటిస్తున్నారట. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఓటీటీ డీల్ సెట్ కావడంతో వేగంగానే షూటింగ్ జరుగబోతుందని టాక్.