MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Obsession: రూ. 7 కోట్ల‌తో తీస్తే రూ. 2,240 కోట్లు వ‌చ్చాయి.. ఇంత‌కీ సినిమాలో అంత‌లా ఏముందిరాబై

Obsession: రూ. 7 కోట్ల‌తో తీస్తే రూ. 2,240 కోట్లు వ‌చ్చాయి.. ఇంత‌కీ సినిమాలో అంత‌లా ఏముందిరాబై

Obsession: భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయనే అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేసిన చిత్రం ‘అబ్సెషన్’. కేవలం రూ. 7 కోట్లతో తెర‌కెక్కిన ఈ సైకాలజికల్ హారర్-రొమాన్స్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 14 2026, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి
Image Credit : Blumhouse/YT

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి

సాధారణంగా హాలీవుడ్‌లో హిట్ సినిమాలు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. కానీ ‘అబ్సెషన్’ మాత్రం ఆ ట్రెండ్‌కు పూర్తి భిన్నం. సుమారు లక్ష డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 234 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో ఇది రూ.2,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత తక్కువ పెట్టుబడితో రూపొందిన సినిమా ఇంతటి స్థాయిలో లాభాలు ఆర్జించడం హాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయంగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫోకస్ ఫీచర్స్ విడుదల చేసిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంత‌కీ సినిమా క‌థ ఏంటి.?
Image Credit : People

ఇంత‌కీ సినిమా క‌థ ఏంటి.?

ఈ చిత్ర కథ మొత్తం ఒక సాధారణ ప్రేమకథతో మొదలవుతుంది. మ్యూజిక్ షాప్‌లో పనిచేసే యువకుడు బేర్ తన స్నేహితురాలు నిక్కీని ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేడు. ఈ సమయంలో అతడి చేతికి ఒక విచిత్రమైన అతీంద్రియ వస్తువు దొరుకుతుంది. దాని ద్వారా తాను ప్రేమించే అమ్మాయి తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ కోరిక నిజమవుతుంది. కానీ ఆ ప్రేమ సాధారణ ప్రేమగా కాకుండా, మితిమీరిన ఆకర్షణగా, నియంత్రణ కోరికగా, చివరకు ప్రమాదకరమైన మోజుగా మారుతుంది. అక్కడి నుంచే కథ భయానక మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ఆకర్షణ, మానసిక అస్థిరత, అతీంద్రియ శక్తులు కలిసిన కథనంతో దర్శకుడు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచాడు.

Related Articles

Related image1
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Related image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
35
అనునిత్యం ఉత్కంఠభ‌రితం
Image Credit : Movie Stills

అనునిత్యం ఉత్కంఠభ‌రితం

‘అబ్సెషన్’ను సాధారణ హారర్ సినిమాగా చూడలేం. ఇందులో జంప్ స్కేర్స్, రక్తపాత సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ సినిమా మొత్తం ఒక అసహజమైన భయం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, వారి సంబంధాలపై దర్శకుడు ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే ఒకసారి అతీంద్రియ కోరిక నెరవేరిన తర్వాత కథ వేగం పూర్తిగా మారిపోతుంది.

ప్రత్యేకంగా సెకాండాఫ్ లో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను సీట్లోంచి కదలనివ్వవు. తర్వాత ఏమి జరుగుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది. క్లైమాక్స్ వరకు అదే ఉత్కంఠ కొనసాగుతుంది. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ తమ పాత్రల్లో సహజంగా నటించారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో కనిపించే భావోద్వేగ మార్పులు కథకు ప్రధాన బలంగా నిలిచాయి.

అబ్సెషన్ మూవీ ట్రైలర్

45
ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలేంటి?
Image Credit : India TV News

ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలేంటి?

‘అబ్సెషన్’ విజయానికి ప్రధాన కారణం దాని కథనం. ఇటీవల విడుదలవుతున్న అనేక హారర్ చిత్రాలు ఒకే తరహా ఫార్ములాను అనుసరిస్తుంటే, ఈ చిత్రం మాత్రం కొత్త అనుభూతిని అందించింది. అలాగే దర్శకుడు కర్రీ బార్కర్ విజువల్ ఎఫెక్ట్స్‌పై కాకుండా వాతావరణ సృష్టిపై దృష్టి పెట్టాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ కలిసి ప్రేక్షకుల్లో అసౌకర్య భావనను కలిగిస్తాయి. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. సోషల్ మీడియాలో వచ్చిన సానుకూల స్పందన కూడా భారీ పాత్ర పోషించింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను పంచుకోవడంతో మౌత్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించింది. దీంతో ప్రతి వారం వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.

55
ఓటీటీ విడుదలపై పెరిగిన ఆసక్తి
Image Credit : Movie Stills

ఓటీటీ విడుదలపై పెరిగిన ఆసక్తి

ప్రారంభంలో ఈ సినిమా త్వరగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోకి వస్తుందని భావించారు. కానీ థియేటర్లలో కొనసాగుతున్న విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఓటీటీ విడుదలను కొంతకాలం వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం త్వరలోనే రెంట‌ల్ విధానంలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారతదేశంలో ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఓటీటీలో ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంతా భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Recommended image2
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image3
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Related Stories
Recommended image1
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Recommended image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved