తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి స్టార్ గా ఎదిగిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న చాలామంది స్టార్.. ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చిన వారే. అయితే చాలామంది తమ గతాన్ని మర్చిపోయి విర్రవీగుతుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత ఎదిగినా.. తమ బ్యాక్ గ్రౌండ్ న గుర్తు పెట్టకుని సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. తాజా ఓ హీరోయిన్ కూడా తన గత జీవితం గురించి వెల్లడించింది. తాను ఫేస్ చేసిన కష్టాలు చెప్పుకొచ్చింది ఇంతకీ ఎవరా తార.

ప్రస్తుత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా లగ్జరీ లైఫ్ ను గడుపుతున్న ఓ తార... గతంలో కడుపునిండా తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడింది. తాను ఫేస్ చేసిన కష్టాలను, ఆర్థిక సమస్యల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తిండి కూడా సరిగ్గా లేక నీళ్ళుమాత్రమే తాగి రోజులను గడిపిన సందర్భాలను ఆమె గుర్తు చేసుకుంది రోజుకు తమ దగ్గర కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఉండేవని వాటితోనే ఫ్యామిలీ ఆరోజు గడిపేలా ప్లాన్ చేసుకునేవారమని చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.
ఆ హీరోయిన్ ఎవరో కాదు నుష్రత్ భరుచా. ఈమె ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ హీరోయిన్. కెరియర్ ప్రారంభంలో బుల్లితెర మీద పలు సీరియల్స్ లో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ టెలివిజన్లో ప్రచారం అయ్యే కిట్టి పార్టీ అనే ఒక సీరియల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసింది. ఇక వెండితెరపైకి మాత్రం ఏక్తా కపూర్ తెరకెక్కించిన ఒక సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే హిందీలో వరుస సినిమా అవకాశాలు సాధించింది. కార్తీక్ ఆర్యన్ నటించిన ప్యార్ క పంచనామా సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది నుష్రత్. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాయి.
నుష్రత్ భరుచా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లు కలెక్షన్లు రాబట్టి ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. నుష్రత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబంలో తను మాత్రమే సంపాదించేదని తెలిపింది. చదువుకుంటున్న రోజుల్లో తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు కూడా చెప్పుకొచ్చింది. రోజుకు 8 రూపాయిలు ఉండేవి.వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అలవాటు అయ్యింది. అందుకే స్టార్ గామారి.. సంపాధిస్తున్న టైమ్ లో కూడా బాధ్యతగా ఖర్చు చేయడం వచ్చిందన్నారు.
ఎంత డబ్బు వచ్చినా కూడా వాటిలో అవసరాలన్నీ తీరిన తర్వాత వేరేది కొనుగోలు చేయడం లేదా డబ్బులను పొదుపు చేయడం వంటివి చేసినట్లు తెలిపింది. మిగిలినడబ్బులను ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. తన తండ్రి వ్యాపారంలో మోసపోయిన తర్వాత తన ప్రపంచాన్ని మార్చుకున్నట్లు ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను చూడడంతో డబ్బులను ఖర్చు చేయడంలో ఇప్పటికీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.