- Home
- Entertainment
- `అడవి రాముడు` రికార్డులు బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఎన్టీఆర్ మూవీ ఏంటో తెలుసా?
`అడవి రాముడు` రికార్డులు బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఎన్టీఆర్ మూవీ ఏంటో తెలుసా?
ఎన్టీఆర్ తన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. కానీ `అడవి రాముడు` వంటి సంచలనాత్మక సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఓ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

పౌరాణిక పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన ఎన్టీఆర్
నటరత్న ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా దశ దిశని మార్చిన నటుడు. పౌరాణిక, జానపద చిత్రాలు వన్నెతెచ్చిన నటుడు.
ఆడియెన్స్ చేత జేజేలు కొట్టించుకున్న నటుడు. ఆయన ఎవరూ చేయనన్ని పౌరాణిక సినిమాలు చేశారు. ఆయా పాత్రలు పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు.
అదే సమయంలో కమర్షియల్ చిత్రాలతోనూ అదరగొట్టారు. `అడవిరాముడు`, `వేటగాడు` వంటి చిత్రాలతో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించారు.
`అడవి రాముడు`తో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు
ఎన్టీఆర్ కెరీర్‌లోనే `అడవి రాముడు`(1977) ఒక సంచలనం. ఈ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. అత్యధిక రోజులు ప్రదర్శించిన మూవీగా నిలిచింది. అదే సమయంలో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగానూ నిలిచింది.
ఈ సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. ఇది అప్పట్లోనే మూడు కోట్ల కలెక్షన్లని సాధించిన అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. 300 రోజులకుపైగా థియేటర్లలో ప్రదర్శించబడింది.
`అడవి రాముడు` రికార్డులను బ్రేక్ చేస్తూ `వేటగాడు` సంచలనం
తన `అడవి రాముడు` మూవీ రికార్డులను తానే బ్రేక్ చేశారు ఎన్టీఆర్. రెండేళ్లలోనే ఆయన మరో సంచలనం సృష్టించారు. అదే `వేటగాడు`(1979). ఈ మూవీ `అడవి రాముడు` పేరుతో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.
కలెక్షన్ల పరంగా ఆరు కోట్ల వరకు రాబట్టింది. 53 రోజుల్లోనే ఇది కోటి రూపాయలు వసూలు చేసింది. అంతేకాదు 408 రోజులు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది.
అప్పట్లో ఇదే రికార్డు. అంత వరకు మరే సినిమా ఈ రేంజ్‌లో ఆడలేదు. అలా `వేటగాడు` మూవీ గత చిత్రాల రికార్డులన్నీంటిని బ్రేక్ చేయడం విశేషం.
ఎన్టీఆర్, శ్రీదేవి కెమిస్ట్రీ హైలైట్‌గా `వేటగాడు`
ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకుడు. `అడవి రాముడు` తర్వాత వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన చిత్రమిది. రోజా మూవీస్ పతాకంపై ఎం అర్జున రాజు, కె శివరామ రాజు నిర్మించారు. ఇందులో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది.
అంతకు ముందు `బడిపంతులు` చిత్రంలో ఎన్టీఆర్‌కి మనవరాలిగా బాల నటిగా నటించిన శ్రీదేవి ఈ మూవీతోనే హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దాదాపు ఏడేళ్ల తర్వాత రామారావుతో నటించింది.
మొదట శ్రీదేవి హీరోయిన్ అంటే అంతా ఆశ్చర్యపోయారు. రామారావు సరసన ఈ అమ్మాయేంటి? అన్నారు. దర్శకుడు కన్విన్స్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు.
కానీ ఇందులోని `ఆకు చాటు పింద తడిసే` పాట ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పట్లో మాస్ ఆడియెన్స్ ని ఊర్రూతలూగించింది. ఈ పాట కోసమే ఆడియెన్స్ సినిమా చూడటం విశేషం. అంతగా ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు.
ఇందులో ఎన్టీఆర్, శ్రీదేవి కూడా అదరగొట్టారు. వీరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఇదేకాదు ఇందులోని పాటలన్నీ బంపర్ హిట్.
ఆరు కోట్లతో ఇండస్ట్రీ హిట్‌గా `వేటగాడు`
ఇలా ఎన్టీఆర్ తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు. `వేటగాడు` మూవీ లాంగ్ రన్‌లో ఆరు కోట్ల వరకు వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీ తర్వాత అటు ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్‌కి, మరోవైపు రామారావు, రాఘవేంద్రరావు కాంబినేషన్‌కి విశేషమైన పాపులారిటీ సొంతమైంది. మార్కెట్ పరంగానూ అది బాగా కలిసి వచ్చింది.
ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో అనేక సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉంటే `వేటగాడు` మూవీ జులై 5న విడుదలైంది. ఇటీవలే 46ఏళ్లు పూర్తి చేసుకుంది.