MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట

Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట

Rashmi Gautam: యాంకర్‌ రష్మి గౌతమ్‌ మొదటి సారి తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌  గురించి వెల్లడించింది. వాళ్లకు సినిమాకి సంబంధం లేదని, తాను మాత్రమే దారి తప్పి వచ్చినట్టు వెల్లడించింది.    

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 29 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
13ఏళ్లుగా జబర్దస్త్ ని హోస్ట్ చేస్తున్న రష్మి గౌతమ్‌
Image Credit : youtube/@mallemalatv

13ఏళ్లుగా జబర్దస్త్ ని హోస్ట్ చేస్తున్న రష్మి గౌతమ్‌

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్‌ అయ్యింది రష్మి గౌతమ్‌. దాదాపు 13ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూ ఆకట్టుకుంటోంది. తనదైన కామెడీతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తోంది. సుమ తర్వాత ఒక షోని ఇంత లాంగ్‌ రన్‌లో హోస్ట్ చేస్తున్న యాంకర్‌గా రష్మి రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆమె జబర్దస్త్ కామెడీ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు కొత్తగా ఆమె `ఆహా` కోసం టాప్‌ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్‌ షో చేస్తుంది. ఇటీవలే దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్ ఈవెంట్‌ జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రష్మి గౌతమ్‌ ఫ్యామిలీ నేపథ్యం
Image Credit : Asianet News

రష్మి గౌతమ్‌ ఫ్యామిలీ నేపథ్యం

ఈ క్రమంలో రష్మి గౌతమ్‌ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన బ్యాక్‌గ్రౌండ్‌ గురించి వెల్లడించింది. తన అమ్మ మమతా గౌతమ్‌ ది ఒరిస్సా అట. అలాగే తన నాన్న రామ్‌ గౌతమ్‌ ది ఉత్తర ప్రదేశ్‌ అట. తాను విశాఖపట్నంలో పుట్టి పెరిగినట్టు తెలిపింది. అయితే తమ ఫ్యామిలీ అంతా సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అట. వాళ్లు చాలా కూల్‌గా, అఫీషియల్‌గా, డిగ్నిటీగా ఉంటారని తెలిపింది రష్మి. తాను మాత్రమే ఈ రంగంలోకి వచ్చినట్టు చెప్పింది. తన అమ్మా నాన్నలకుగానీ, తాతలు, అన్నలు, అమ్మమ్మలకుగానీ ఈ సినిమా రంగంతో సంబంధం లేదని తెలిపింది రష్మి. తాను దారి తప్పి సినిమా రంగంలోకి వచ్చానని, దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో సర్వైవ్‌ అవుతూ వస్తున్నట్టు చెప్పింది. ఈ జబర్దస్త్ యాంకర్‌ నాన్న తన చిన్నప్పుడే మరణించాడట. దీంతో తల్లినే తనని పెంచిందట.

Related Articles

Related image1
Rajamouli: సినిమా డిజాస్టర్‌, రాజమౌళి పని అయిపోయింది.. ఆస్తులు అమ్మేందుకు రెడీ అయిన రమా రాజమౌళి
Related image2
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
34
సీరియల్‌తో కెరీర్‌ ప్రారంభించిన రష్మి గౌతమ్‌
Image Credit : Instagram/Rashmi Gautam

సీరియల్‌తో కెరీర్‌ ప్రారంభించిన రష్మి గౌతమ్‌

తాను మొదట `యువ` అనే సీరియల్‌లో నటించినట్టు చెప్పింది. ప్రారంభంలో సీరియల్స్ చేశానని, కానీ పెద్దగా గుర్తింపు రాలేదని, ఆ తర్వాత కొంత కాలం బ్రేక్‌ తీసుకున్నట్టు తెలిపింది. అనంతరం మళ్లీ ప్రయత్నాలు చేయగా, సినిమా అవకాశాలు వచ్చాయని, ఈ క్రమంలోనే జబర్దస్త్ కి యాంకర్‌గా చేసే ఛాన్స్ ని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది రష్మి గౌతమ్‌.

44
ఐటెమ్స్ సాంగ్స్ కి నో
Image Credit : instagram/rashmi gautam

ఐటెమ్స్ సాంగ్స్ కి నో

సినిమాల గురించి రష్మి చెబుతూ, ఇప్పుడు సరైన ఆఫర్లు రావడం లేదని, ఐటెమ్‌ సాంగ్స్, స్పెషల్‌ సాంగ్స్ కోసం అడుగుతున్నారని, అందుకే తాను చేయడం లేదని వెల్లడించింది. మంచి పాత్రలు వస్తే చేయడానికి తాను సిద్ధమే అని, మంచి అవకాశాల కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది. ఇప్పుడు ఆహాలో చేయబోతున్న సరికొత్త షో ఇన్‌ఫ్లూయెన్సర్లని వెలికితేసే షో అని, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలిపింది రష్మి గౌతమ్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Related Stories
Recommended image1
Rajamouli: సినిమా డిజాస్టర్‌, రాజమౌళి పని అయిపోయింది.. ఆస్తులు అమ్మేందుకు రెడీ అయిన రమా రాజమౌళి
Recommended image2
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved