MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్‌ వార్నింగ్‌.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు

జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్‌ వార్నింగ్‌.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు

ఎన్టీఆర్‌, జయసుధ కలిసి చాలా సినిమాలు చేశారు. వీరిది మంచి హిట్‌ కాంబినేషన్‌ కూడా. అయితే ఈ క్రమంలో జయసుధకి ఎన్టీఆర్‌ ఓ విషయంలో సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడట. మరి అదేంటో చూద్దాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 09 2025, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
sr nt, jayasudha

sr nt, jayasudha

ఎన్టీఆర్‌-శ్రీదేవి, ఎన్టీఆర్‌-జయప్రద లాగానే ఎన్టీఆర్‌-జయసుధ కాంబినేషన్‌ కూడా బాగా హిట్‌ పెయిర్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు హిట్లు, సూపర్‌ హిట్లు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి.

`అనురాగ దేవత`, `డ్రైవర్‌ రాముడు`, `గజదొంగ`, `సింహం నవ్వింది`, `అడవి రాముడు`, `యుగంధర్‌`, `శ్రీనాథ కవి సర్వభౌముడు`, `కేడీ నెం 1`, `లాయర్‌ విశ్వనాథ్‌`, `మహాపురుషుడు`, `సరదా రాముడు` వంటి మూవీస్‌ ఎన్టీ రామారావు, జయసుధ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sr nt, jayasudha

sr nt, jayasudha

అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన ఈ జంట మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జయసుధ విషయంలో ఎన్టీఆర్‌ విసిగిపోయాడట. ఆమెకి గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందట. సినిమాలన్నా మానేయ్‌, లేదంటే ఆ మాట చెప్పడమన్నా మానేయ్‌ అనే పరిస్థితి వచ్చిందట. రామారావు ఇచ్చిన ఝలక్‌ తర్వాత గాడిలో పడిందట జయసుధ. మరి ఇంతకి వీరి మధ్య జరిగిందేంటి? ఎన్టీఆర్‌ ఎందుకు వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందనేది చూస్తే. 

35
sr nt, jayasudha

sr nt, jayasudha

జయసుధ చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. కేవలం 13ఏళ్లకే ఆమె సినిమాల్లోకి వచ్చింది. ప్రముఖ దర్శకురాలు, నటి విజయ నిర్మల వరుసకి పిన్ని అవుతుంది. ఇద్దరి మధ్య మంచి బంధుత్వం ఉంది. చిన్నప్పుడు సరదాగా విజయ నిర్మలతో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్లేదట. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.

విజయ నిర్మల సపోర్ట్ తోనే ఆమె సినిమాల్లోకి వచ్చింది. తాను నటించిన `పండంటి కాపురం` సినిమాలో చిన్న పాత్ర కోసం జయసుధని ఎంపిక చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోయిన్‌గా మారి ఓ ఊపు ఊపేసింది. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు, బ్లాక్‌ బస్టర్స్ అందుకుంది జయసుధ. 
 

45
jayasudha

jayasudha

ఆమెకి 19ఏళ్లు వచ్చేసరికి మంచి క్రేజ్‌ వచ్చింది. స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. అప్పట్లో ఆ ఏజ్‌లో ఏ హీరోయిన్‌కి రాని క్రేజ్‌ వచ్చింది. టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అత్యధిక పారితోషికం కూడా అందుకుంది.

సినిమాల పరంగా అన్నిరకాలుగా పీక్‌ కెరీర్‌ చూసిన జయసుధ ఓ దశలో ఇక సినిమాలు చాలు, మానేయాలనుకుందట. ఒప్పుకున్న సినిమాలు చేసి ఇక చేయను అనేదట. ఇలా చాలా సార్లు ఇలానే చెబుతూనే వచ్చింది. కానీ ఆమెకున్న క్రేజ్‌కి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

వరుసగా మేకర్స్ క్యూ కడుతూనే ఉన్నారు. తాను కూడా నో చెప్పలేక చేస్తూనే వెళ్లింది. ఎట్టకేలకు పెళ్లి కూడా కుదిరింది. దీంతో ఇక మ్యారేజ్‌ తర్వాత సినిమాలు మానేస్తా అని చెప్పుతూ తిరిగిందట. షూటింగ్‌ సెట్‌లో కూడా హీరోలతో ఇదే మాట పదే పదే రిపీట్‌ చేసేదట. కానీ యదావిధిగా సినిమాలు చేస్తూనే ఉందట. 
 

55
sr ntr

sr ntr

ఈ మాట ఎన్నో సార్లు విన్న ఎన్టీఆర్‌కి పిచ్చెక్కిపోయింది. దీంతో ఆమెపై ఫైర్‌ అయ్యాడట రామారావు. సినిమాలు మానేస్తా అని చెబుతుంది కానీ మానేయడం లేదు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమెని పట్టుకుని ఝలక్‌ ఇచ్చాడట.

ఫస్ట్ నువ్వు సినిమాలన్నా మానేయ్‌, లేదంటే `నేను సినిమాలు మానేస్తా` అని చెప్పడం అయినా మానేయ్‌, ఏదో ఒకటి ఫస్ట్ చేయ్‌ అని సీరియస్‌ అయ్యాడట. అప్పటి వరకు నార్మల్‌ చెబుతూ వచ్చిన జయసుధ రామారావు అంతటి సీరియస్‌గా చెప్పడంతో ఇక అప్పట్నుంచి ఆ మాట చెప్పడం మానేసిందట. తనకు వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వచ్చింది.

కాకపోతే సెలక్టీవ్‌గా వెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిస్తున్న జయసుధ ఇప్పటి వరకు 300లకుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇందులో తెలుగు సినిమాలే మేజర్‌గా ఉన్నాయి. తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేస్తూ వచ్చింది జయసుధ.  ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరుస్తుంది. 
read more: విడాకులు తీసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరా? సింగర్‌ కల్పన ఫైర్‌.. మహిళా కమిషన్‌కి ఫిర్యాదు

also read: అలియా భట్‌ కూతురికి పేరు పెట్టిన తెలుగు సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? డెలివరీకి ముందే ఆ పని

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image2
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image3
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved