Singer Kalpana: సింగర్ కల్పన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. ఈ మేరకు ఉమెన్ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.
Singer Kalpana: సింగర్ కల్పన ఫైర్ అయ్యింది. విడాకులు తీసుకుంటే, రెండో పెళ్లి చేసుకుంటే మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వరా? వాళ్లని తక్కువగా చూస్తారా అంటూ మండిపడింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఫైర్ అయ్యింది.
ఈ మేరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదని కలిసి శనివారం ఫిర్యాదు చేసింది. పలు యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఉమెన్ కమిషన్‌ని సింగర్ కల్పన కోరారు.
సినిమా సెలబ్రిటీల వెంటపడటం ఆపేయండిః సింగర్ కల్పన
ఇందులో ఆమె మాట్లాడుతూ, మీరు ఎంత ఈజీగా బ్యాడ్ న్యూస్‌ని వ్యాపింప చేస్తున్నారు. దీన్ని కరెక్ట్ చేయడానికి నేను మళ్లీ బతికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. జనాలకు కావాల్సిన చాలా ముఖ్యమైన పనులున్నాయి. సమస్యలున్నాయి. అవన్నీ వదిలేసి సినిమా సెలబ్రిటీల మీద ఫోకస్ పెట్టడం తగ్గించండి. అవసరమైన విషయాలపై ఫోకస్ పెట్టండి.
ఎంతో మంది మహిళలు ఎంతో కష్టాలు పడుతున్నారు, చిన్నపిల్లలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వేధింపులు జరుగుతున్నాయి. ఎంతో మంది అనాథలుగా జన్మిస్తున్నారు. ఆ సమస్యలు పట్టవా? వాటిపై మీకు బాధ కలిగించడం లేదా? అవి మీకు కనిపించడం లేదా? అటు వైపు కెమెరా తిప్పండి.
విడాకులు తీసుకుంటే సమాజం మంచిగా చూడదాః సింగర్ కల్పన
మన దేశానికి ఏం కావాలో అది తీసుకురావడానికి ప్రయత్నించండి. అంతేకానీ మమ్మల్ని వినోదాత్మక వస్తువులుగా చూడకండి. మాకు ఫ్యామిలీలున్నాయి. మాకూ చాలా వ్యక్తిగత సమస్యలున్నాయి. విడాకులు అయితే, మరో పెళ్లి చేసుకుంటే మాకు ఈ సమాజంలో విలువ లేదా? మమ్మల్ని మంచిగా చూడరా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కల్పన.
సింగర్ కల్పన ఇటీవల అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. భర్తతో గొడవలతో ఆమె ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిందనే వార్తలు వచ్చాయి. కానీ దాన్నుంచి కోలుకున్న కల్పన దీనిపై క్లారిటీ ఇచ్చింది. తనకు భర్తతో ఎలాంటి గొడవలు లేవని, తాము బాగానే ఉన్నామని, కానీ తాను రెగ్యూలర్‌గా తీసుకోవాల్సిన టాబ్లెట్ల డోస్ పెరిగి అలా జరిగిందని, అంతేకానీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపిన విషయం తెలిసిందే.
read more: విజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన`కి నో చెప్పిన రుక్మిణి వసంత్.. రష్మిక మందన్నానే కారణమా?
also read: అలియా భట్ కూతురికి పేరు పెట్టిన తెలుగు సూపర్ స్టార్ ఎవరో తెలుసా? డెలివరీకి ముందే ఆ పని