ఎన్టీఆర్ చెప్పిన పాన్ ఇండియా సినిమాల సక్సెస్ ఫార్మూలా, ఈ చిన్న లాజిక్ వదిలేసి కోట్లు కుమ్మరిస్తున్నారే?
పాన్ ఇండియా సినిమాలపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇంత చిన్న లాజిక్ మర్చి చాలా మంది మేకర్స్ వందల కోట్లు కుమ్మరిస్తూ దారుణమైన ఫలితాలను చవిచూస్తున్నారు.
ఎన్టీఆర్ ఇటీవల `దేవర` సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. గత నెల 27న విడుదలైన ఈ మూవీ ఇంకా మంచి వసూళ్లని రాబడుతుంది. భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. నాలుగు వందల కోట్లు దాటి ఐదు వందల కోట్ల దిశగా వెళ్తుంది. వరుస సెలవులు కలిసి రావడంతో `దేవర` మొత్తానికి గట్టెక్కింది. నిర్మాతలకు, బయ్యర్లకి లాభాలను అందిస్తుంది. ఇటీవల కాలంలో బయ్యర్లని హ్యాపీ చేసిన పెద్ద సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరో వారం పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి కలిసి వస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
`దేవర` థియేటర్లలో సందడి చేస్తుంది. దీంతో మేకర్స్ ఇటీవలే సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. సుమ ఇంటర్వ్యూలో తారక్ పాన్ ఇండియా సినిమాలపై హాట్ కామెంట్ చేశారు. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాల సక్సెస్ ఫార్మూలా లీక్ చేశాడు. మేకర్స్ సినిమాల్లో అది క్రియేట్ చేయగలిగితే సినిమా హిట్ అని తేల్చేశారు. `బాహుబలి`, `కేజీఎఫ్`, `కల్కి` సినిమాల విజయాలకు కారణాలను తెలిపారు. హాలీవుడ్ సినిమాల విజయానికి కారణం ఏంటో చెప్పారు. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటో చెప్పకనే చెప్పారు ఎన్టీఆర్.
పాన్ ఇండియా సినిమాలంటే ఏదో కథతో చేయడం కాదని, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం అని తెలిపారు. ఇప్పుడు ఆడియెన్స్ కి కొత్త ప్రపంచాలు కావాలని, ఓ కొత్త వరల్డ్ ని సృష్టిస్తే సినిమా హిట్టే అని తేల్చేశాడు. ఇక్కడ మరో ప్రపంచాన్ని సృష్టించడమే ఇక్కడ మెయిన్ పాయింట్ అని చెప్పారు. అలాంటి సినిమాలే విజయాలు సాధించాయని తెలిపారు. `బాహుబలి` తీసుకుంటే మనం సినిమా చూస్తున్నంత సేపు `మహీష్మతి సామ్రాజ్యం`లో ఉంటాం. అక్కడక్కడే తిరుగుతుంటాం. మన చుట్టూనే ఇదంతా జరుగుతుందా అని ఫీలవుతాం. అందుకే ఒక అద్భుతమైన ఫీలింగ్‌ని పొందుతామని చెప్పారు ఎన్టీఆర్.
`కేజీఎఫ్` సినిమా చూస్తే సినిమా మొత్తం కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోనే జరుగుతుంది. అందులోనే మనం కూడా ఉండిపోతాం. దాన్నుంచి బయటకు రాలేం. చూస్తున్నంతసేపు అదే మనసులో తలుచుకుంటాం. అంతేకాదు ఇటీవల వచ్చిన `కల్కి 2898ఏడీ` కూడా అంతే. భవిష్యత్‌లోకి వెళ్లిపోతాం. అదే లోకంలో ఉండి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్వయంగా మన చుట్టూనే అవన్నీ జరుగుతున్నాయనిపిస్తుంటుంది. అందుకే అలాంటి కొత్త ప్రపంచాలను పరిచయం చేసే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల సక్సెస్ సీక్రెట్ కూడా అదే. సూపర్ హీరో సినిమాలు ఓ కొత్త లోకంలో జరుగుతుంటాయి. దాన్ని మనం ఎంజాయ్ చేస్తుంటాం. అది మనకు బాగా నచ్చుతుంది. అందుకే హాలీవుడ్ మూవీస్ భారీ విజయాలు సాధిస్తుంటాయని తెలిపారు.
పాన్ ఇండియా సినిమాలు చేసే దర్శకుడికి కూడా ఇదే అతిపెద్ద ఛాలెంజ్. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడమే ఇక్కడ అసలైన టాస్క్. ఇప్పుడు ఆడియెన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. అలాంటి కథలనే ఎంజాయ్ చేస్తున్నారు. ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. `దేవర` సినిమాలో ఆ కోస్టల్ ఏరియాని క్రియేట్ చేయడమే పెద్ద టాస్క్ అని, కొరటాల చాలా కష్టపడ్డాడు అని తెలిపారు.
`దేవర` సక్సెస్‌కి కూడా అదో కారణంగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడని చెప్పొచ్చు. ఈ విషయం మర్చిపోయి చాలా మంది మేకర్స్ పాన్ ఇండియా పేరుతో ఏవేవో సినిమాలు చేసి బోల్తా కొడుతున్నారు. వందల కోట్లు బూడితలో పోస్తున్నారు. ఈ విషయంలో తారక్ చెప్పిన సూచనలు పాటిస్తే కొంత బెటరేమో.
అయితే కథ ఏదైనా, సినిమా ఏదైనా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంతటి గ్రాండియర్ ఉన్నా, మరో ప్రపంచంలోకి తీసుకెళ్లినా, సినిమాకి ఓ సోల్ ఉంటుంది, ఓ ఎమోషన్ ఉంటుంది. దానికి ఆడియెన్స్ కనెక్ట్ అయితేనే సినిమా ఆడుతుంది, లేదంటే దారుణమైన రిజల్ట్ తప్పదు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన `దేవర` ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయగా, సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశారు. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిందని సమాచారం. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 184కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. డిజిటల్ రైట్స్ రూపంలో మరో వంద కోట్లకుపైనే వచ్చినట్టు సమాచారం. థియేట్రికల్‌గా ఈ మూవీ సేఫ్ జోన్‌లోకి వెళ్లిందని తెలుస్తుంది.